పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ సినిమాని డైరక్ట్ చేసిన వీరశంకర్ తాజాగా మరో చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. యువరాజ్యం పేరుతో నిర్మాణమయ్యే ఈ సినిమా యువతే లక్ష్యంగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వీరశంకర్ మాట్లాడుతూ...మెడికల్ కాలేజీలు..డాక్టర్స్ ని తయారు చేస్తూంటాయి. ఇంజనీరింగ్ కాలేజీలు ఇంజనీర్స్ ని తయారు చేస్తాయి..లా కాలేజీలు న్యాయవాదులను తయారు చేస్తాయి. అయితే యువరాజ్యం ఎవర్ని తయారు చేస్తుంది.రాజకీయనాయకులనా లేక యువజన నాయకులనా లేక సమాజానికి ఉపయోగపడే సర్వీస్ వాలంటీర్స్ నా అనేది నా సినిమా చెబుతుంది. త్వరలో ఈ సినిమాకు పనిచేయబోయే సాంకేతిక నిపుణులు,నిర్మాత వంటి విషయాలు తెలియచేస్తామంటున్నారాయన. పవన్ ఈ సినిమాలో గెస్ట్ గా చేయమని అడిగే అవకాశముందని సమాచారం. బెస్టాఫ్ లక్ వీర్ శంకర్
Story first published: Saturday, January 31, 2009, 14:42 [IST]