twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిన్న టీజర్ లుక్, ఈ రోజు ఫస్ట్ లుక్: మొత్తానికి పోస్టర్ ఇరగదీసారు

    |

    Recommended Video

    నిన్న టీజర్ లుక్, ఈ రోజు ఫస్ట్ లుక్ పోస్టర్ ఇరగదీసారుగా..

    ఓ పెళ్లి నలుగురు అమ్మాయిల జీవితాలను ఎలా మార్చేసిందనే కథతో వీర్ ది వెడ్డింగ్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సోనమ్ తోపాటు కరీనా కపూర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఓ బ్రహ్మాండమైన హిట్ తర్వాత మళ్లీ సినిమా చేస్తుండటంతో సోనమ్ షూటింగ్ సెట్లో తెగ ఉత్సాహంగా కనిపిస్తోంది. షూటింగ్ ప్లేస్ లో కరీనా తోపాటు మరో యాక్టర్ స్వర భాస్కర్ తో కలిసి సెల్ఫీలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

    దేవకన్యలా? హీరోయిన్లా??: వీర్ ది వెడ్డింగ్ టీజర్ లుక్దేవకన్యలా? హీరోయిన్లా??: వీర్ ది వెడ్డింగ్ టీజర్ లుక్

    వీర్ ది వెడ్డింగ్

    వీర్ ది వెడ్డింగ్

    అసలు వీర్ ది వెడ్డింగ్ సినిమా ఎప్పుడో స్టార్ట్ కావాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభిద్దామనుకునే సమయానికి కరీనా ప్రెగ్నెంట్ అనే విషయం కన్ఫర్మ్ అయింది. దీంతో ఈ సినిమా షూట్ పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. అలా కొన్నాళ్ళు ఆగి మళ్ళీ మొదలైన ఈ సినిమాకి ముహూర్థం దగ్గర పడింది.

     సినిమా మొత్తం వేడుకలే.

    సినిమా మొత్తం వేడుకలే.

    కరీనా కపూర్‌ పెళ్లి చుట్టూ ఈ సినిమా సాగుతుంది. సినిమా మొత్తం వేడుకలే. పెళ్లికి అందరూ రెడీ అవుతున్న ఒక ఫొటోను టీజర్ లుక్‌గా విడుదల చేసిన చిత్రబృందం. అందులో ఈ సినిమా క్యాస్టింగ్ కాస్త గట్టిగానే ఉంది. ఇందులో కొత్తమ్మాయి షికా తల్సానియాను పక్కనెట్టేస్తే.. మన ముగ్గురు ఏంజిల్స్ మాత్రం ఏదో మాయ చేస్తున్నారు.

    ఫస్ట్ లుక్ పోస్టర్

    ఫస్ట్ లుక్ పోస్టర్

    హాట్ బ్యాక్ తో సందడి చేస్తున్న సోనమ్ కపూర్.. ఆమె చేతిలోనే ఫ్యాన్ చాటున దాక్కున్న కరీనా.. అలాగే తన కాలి జూతాను సరిచేసుకుంటూ.. వయ్యారాలను వడ్డిస్తున్న స్వరా భాస్కర్.. అబ్బో లెహంగాల్లో భలే మ్యాజిక్ చేశారు.అందుకే ఒక్కసారిగా బాలీవుడ్ లో ఈ పోస్టర్ వైరల్ అయిపోయింది. ఇంకా ఆ టీజర్ లుక్ సందడి తగ్గకముందే. ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.

    వచ్చే ఏడాది మే 18న విడుదల

    వచ్చే ఏడాది మే 18న విడుదల

    వీర్ ది వెడ్డింగ్ టీమ్ బుధవారం మరో స్టిల్‌ రిలీజ్‌ చేసింది. ‘ముహూర్తం ఫిక్స్‌' అనే పోస్టర్‌ అది. అంటే... విడుదల తేదీ ముహూర్తం అన్నమాట. తప్పకుండా రావాలి అంటూ నే ‘ఇదే మా ఆహ్వానం.. సేవ్‌ ది డేట్‌' అని రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది మే 18న ఈ చిత్రం విడుదల కానుంది. శశాంకా ఘోష్‌ ఈ చిత్రానికి దర్శకుడు.

    కరీనా పెళ్లి వేడుకలు

    కరీనా పెళ్లి వేడుకలు

    సినిమాలో కరీనా పెళ్లి వేడుకలు పసందుగా ఉంటాయట. విడుదల చేసిన రెండు లుక్స్‌లో ఆ కళ కనిపిస్తోంది కదూ! నటి కిరీటి రాజేంద్ర ప్రసాద్‌ హీరోగా ఇంగ్లిష్‌ మూవీ ‘క్విక్‌ గన్‌ మురుగన్‌' తీసిన శశాంకా హిందీలో ‘ముంబై కట్టింగ్‌', ‘కూబ్‌సూరత్‌' సినిమాలు తీశారు.

    శశాంకా దర్శకత్వం

    శశాంకా దర్శకత్వం

    వీటిలో ‘ముంబై కట్టింగ్‌' 11 కథలతో తీసిన సినిమా. ఒక కథకు శశాంకా దర్శకత్వం వహించారు. ప్ర‌స్తుతానికి ఈ చిత్రానికి సంబంధించిన మొద‌టి షెడ్యూల్ షూటింగ్ ఇటీవ‌లే ఢిల్లీలో పూర్త‌యింది. మరి ఈ మూవీతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్న కరీనా, ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

    English summary
    Starring Sonam Kapoor, Kareena Kapoor, Swara Bhaskar, Shikha Talsania, shooting for Veere Di Wedding is yet to be completed. The first look poster of Kareena’s comeback film, however, is already out.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X