For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దేవకన్యలా? హీరోయిన్లా??: వీర్ ది వెడ్డింగ్ టీజర్ లుక్, మెరిసిపోయిన సోనమ్ కపూర్, కరీనా కపూర్ ఖాన్

  |

  దశాబ్ద కాలానికి పైగానే దాదాపు బాలీవుడ్ ని ఏలేసిన తార కరీనాకపూర్, పదేళ్ళపాటు అగ్ర హీరోయిన్ గానే కొనసాగిన కరీనా, సైఫ్ అలీ ఖాన్ తో పెళ్ళితర్వాత కూడా నటించటానికి సిద్ద పడింది, గర్భం తో ఉండగానే ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకుంది, థైమూర్ జ‌న‌నం త‌ర్వాత క‌రీనాక‌పూర్ సినిమాల‌కు బ్రేక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. చోటా నవాబ్ సైఫ్ ఖాన్‌ అలీతో పెళ్లి, కుమారుడు తైమూర్ పుట్టిన తర్వాత కరీనా కపూర్ ఖాన్ తన అందానికి మరింత మెరుగులు దిద్దుకొంటున్నది. బాలీవుడ్‌లో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేంతగా నాజుకుగా తయారైంది కరీనా.

  ఒక్క ముద్దుకే చచ్చిపోతున్నారు.. వైరల్ అవుతున్న శ్రీదేవి ముద్దుల ఫొటో
   లక్ష్య తొలి పుట్టిన రోజు వేడుకలో

  లక్ష్య తొలి పుట్టిన రోజు వేడుకలో

  తాజాగా తుషార్ కపూర్ కుమారుడు లక్ష్య తొలి పుట్టిన రోజు వేడుకలో కరీనా కపూర్ అందం చూసి పలువురు ప్రముఖులు ఆశ్చర్యానికి గురయ్యారట. అప్పటి ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కుమారుడు తైమూర్ పుట్టిన తర్వాత బాలీవుడ్‌లో మళ్ళీ పాగా వేసేందుకు కరీనా కపూర్ తీవ్రంగా కసరత్తులు చేసిందట.

   16 కేజీల బరువు తగ్గింది

  16 కేజీల బరువు తగ్గింది

  గత మూడు నెలల్లో దాదాపు 16 కేజీల బరువు తగ్గింది. అందుకోసం కఠినమైన వర్కవుట్లు చేసింది అని బాలీవుడ్‌కు చెందిన మ్యాగజైన్ కథనాన్ని వెలువరించింది. తైమూర్‌కు జన్మనిచ్చిన తర్వాత 12 వారాలపాటు ఉదరానికి సంబంధించిన ఎక్సర్‌సైజులు, యోగా లాంటి తీవ్రంగా చేసింది.

  అమృతా అరోరా జిమ్‌

  అమృతా అరోరా జిమ్‌

  ముంబై బాంద్రాలోని అమృతా అరోరా జిమ్‌లో ప్రత్యేకంగా వర్కవుట్లు చేసింది. దాంతో ఆమె ఎక్కువ బరువును కోల్పోయింది అని కథనంలో పేర్కొన్నది. నిజంగా అమృతా జిమ్ మహిమో, కరీనా పట్టుదలో గానీ ఆ రిజల్ట్ ఇప్పుడు అద్బుతంగా వచ్చింది. దానికి లేటెస్ట్ గా వచ్చిన వీర్ ది వెడ్డింగ్ అనే సినిమా ప్రీ లుక్ పోస్టరే ఉదాహరణ.

   ఇన్నాళ్ళకి రీఎంట్రీ

  ఇన్నాళ్ళకి రీఎంట్రీ

  ఆ త‌ర్వాత‌ తిరిగి ఇన్నాళ్ళకి రీఎంట్రీ ఇస్తోంది. ప్ర‌స్తుతం క‌రీనా న‌టిస్తున్న "వీర్ ది వెడ్డింగ్‌" చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఆన్ లొకేష‌న్ స్టిల్స్‌, వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేముందు.. దానికి సంబంధించిన టీజర్ లుక్ ఒకటి రిలీజ్ చేశారు.

  ఆస‌క్తిక‌ర పోస్ట‌ర్

  ఆస‌క్తిక‌ర పోస్ట‌ర్

  ఈ పోస్ట‌ర్‌లో బెబో తో పాటు సోన‌మ్ క‌పూర్‌, స్వ‌ర‌భాస్క‌ర్‌, శిఖ త‌ల్సానియా .. శారీ లుక్ రివీల్ చేశారు. సినిమా క‌థాంశాన్ని రివీల్ చేసే ఆస‌క్తిక‌ర పోస్ట‌ర్ ఇది. ఈ ఫ‌స్ట్‌లుక్ అందరినీ ఆకట్టుకుంటుండగా, అందులో క‌రీనా అందం, ఫిట్‌నెస్‌ ప‌రంగా ఎలాంటి మార్పు క‌నిపించ‌డం లేద‌ని నెటిజ‌న్లు పొగిడేస్తున్నారు. కరీనా అందం ఎప్పటికీ తగ్గదంటూ వారు ప్రశంసలు కురిపిస్తున్నారు.

   ముగ్గురు ఏంజిల్స్

  ముగ్గురు ఏంజిల్స్

  ఈ సినిమా క్యాస్టింగ్ కాస్త గట్టిగానే ఉంది. ఇందులో కొత్తమ్మాయి షికా తల్సానియాను పక్కనెట్టేస్తే.. మన ముగ్గురు ఏంజిల్స్ మాత్రం ఏదో మాయ చేస్తున్నారు. హాట్ బ్యాక్ తో సందడి చేస్తున్న సోనమ్ కపూర్.. ఆమె చేతిలోనే ఫ్యాన్ చాటున దాక్కున్న కరీనా.. అలాగే తన కాలి జూతాను సరిచేసుకుంటూ.. వయ్యారాలను వడ్డిస్తున్న స్వరా భాస్కర్.. అబ్బో లెహంగాల్లో భలే మ్యాజిక్ చేశారు.

  ఈ పోస్టర్ వైరల్ అయిపోయింది

  ఈ పోస్టర్ వైరల్ అయిపోయింది

  అందుకే ఒక్కసారిగా బాలీవుడ్ లో ఈ పోస్టర్ వైరల్ అయిపోయింది. ప్ర‌స్తుతానికి ఈ చిత్రానికి సంబంధించిన మొద‌టి షెడ్యూల్ షూటింగ్ ఇటీవ‌లే ఢిల్లీలో పూర్త‌యింది. మరి ఈ మూవీతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్న కరీనా, ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

  English summary
  Kareena Kapoor Khan's much-talked-about comeback venture Veere Di Wedding has an impressive ensemble star cast and the first teaser poster is out! Bebo will be seen on the big screens after her brief pregnancy break.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X