నాన్నా! ఆ పిల్ల కావాలి!!
రవితేజ-అనుష్కజంటగా ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రంషూటింగ్ ఆదివారంఅన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.హీరో ఎన్టీఆర్ క్లాప్ కొట్టగా ప్రభాస్ స్విచాన్ చేశారు.ముహుర్తం షాట్‌కు దర్శకుడు విజయభాస్కర్‌దర్శకత్వం వహించారు. ఇది రవితేజమార్కు సినిమాలా ఉంటూ చివరి అరగంటఉత్తంఠ భరితమైన యాక్షన్‌తోసాగుతుందని ఈ సందర్భంగా రాజమౌళిసినిమా విలేకరులకు చెప్పారు.సింహాద్రి సినిమా తర్వాత తనచిత్రాల్లో హీరోయిన్‌కు ప్రాధాన్యంతగ్గిందని, ఈ సినిమాలో కథానాయిక అనుష్కపాత్రకు మంచి ప్రాముఖ్యత ఉందనితెలిపారు. ఛత్రపతి ఆడియో విడుదలలోజాప్యం జరిగిందని అటువంటి పొరపాటు ఈసారి చేయదలచుకోలేదని రాజమౌళివివరించారు. నిర్మాత ఎంల్ కుమార్ చౌదరిమాట్లాడుతూ రవితేజతోఇంతకుముందు ఇడియట్ సినిమా తీసివిజయం సాధించామని, అతనితోతమకు ఇది రెండో సినిమా అని చెప్పారు.ఈనెల 26 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈసినిమాకు కథ: విజయేంద్రప్రసాద్, మాటలు ఎం రత్నం, సంగీతంకీరవాణి, కెమెరా సర్వేష్ మురారి.


Click it and Unblock the Notifications