‘రగడ’ దర్శకుడితో నాగచైతన్య సినిమా ఖరారు
నాగచైతన్య, దర్శకుడు వీరూ పోట్ల కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతోందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయం ఖరారైంది. మరి కొన్ని రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు విడుదల కానున్నాయి. గతంలో వీరూ పొట్ల నాగార్జునతో 'రగడ', మనోజ్ తో 'బిందాస్' చిత్రాలు రూపొందించారు. ఈ రెండు సినిమాలు బాక్సీఫీసు వద్ద మంచి ఫలితాలు సాధించాయి. ఈ సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వీరూ పొట్ట నాగచైతన్యతో మంచి ఎంటర్ టైన్మెంట్ సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం నాగచైతన్య దేవా కట్ట దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆటో నగర్ సూర్య' చిత్రంలో నటిస్తున్నాడు. అనంతరం 'గగనం' ఫేం రాధామోహన్ దర్శకత్వంలో 'గౌరవం' చిత్రంలో నటించనున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేసే అవకాశం ఉంది. దడ, బెజవాడ వరుస ప్లాపులతో వెనకబడ్డ నాగచైతన్య తర్వలో విడుదలకు సిద్ధం కాబోతున్న 'ఆటో నగర్ సూర్య' చిత్రంపైనే పూర్తి ఆశలు పెట్టుకున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో నాగచైతన్య నటించబోయే చిత్రానికి 'యజ్ఞం ', 'వీరభద్ర' ఫేం రవికుమార్ చౌదర్శకత్వం వహించనున్నారు. బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications











