'దొంగల బండి' డైరక్టర్ నెక్ట్స్ ఆ కామెడీ..

By Srikanya

అల్లరి నరేష్ తో హీరోగా వచ్చిన 'దొంగల బండి' చిత్రంతో డైరక్టర్ గా మారిన రచయిత వేగశ్న సతీష్ తన ద్వితీయ ప్రయత్నంగా 'రామదండు' అనే చిత్రం చేస్తున్నారు. మొదటి చిత్రం ఫెయిలయినా దర్శకుడుగా మంచి మార్కులే వేయించుకున్నారు. గతంలో కబడ్డి కబడ్డి వంటి చిత్రంకు కథ అందించిన ఆయన సొంత చిత్రంకు స్క్రిప్టు వర్క్ బాగోపోవటంతో ఆ చిత్రం ఫెయిల్ అయింది. దాంతో ఈ సారి పకడ్బందీగా స్క్రిప్టుని రెడీ చేసుకుని రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. కృష్ణుడు హీరోగా ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.

ఈ చిత్రంకు మొదట 'ఫుట్ బాల్' అనే టైటిల్ అనుకున్నారని సమాచారం. అయితే పిల్లలు చుట్టూ తిరిగే ఈ కథకు 'రామదండు' అనే టైటిల్ అయితే బావుంటుందని నిర్ణయించారని తెలుస్తోంది. పూర్తి స్ధాయి ఎంటర్టైనమెంట్ తో ఈ చిత్రం రూపొందనుంది. ఫుట్ బాల్ ఆట చుట్టూ ఈ కథ తిరగనుంది. ఈ కథలో కృష్ణుడు పిల్లలకు ఫుట్ బాల్ కోచ్ గా ఉండి ఓ టీమ్ ని తయారుచేసి గెలుపొందటం ముఖ్యాంశంగా రూపొందనుందని వినపడుతోంది. బెస్టాఫ్ లక్ సతీష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X