ఆ ఆలోచన విరమించుకున్న నందమూరి కుటుంబ సభ్యులు!
నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలనుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారులు హరికృష్ణ అంతిమ యాత్ర కోసం ప్రత్యేకమైన వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది.
హరికృష్ణ అంత్యక్రియలు జూబ్లీ హిల్స్ లోని మహా ప్రస్థానంలో జరగనున్నాయి. ఇదిలా ఉండగా హరికృష్ణ అంత్యక్రియల కోసం ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించిన చైతన్య రథాన్ని సిద్ధం చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో వేల కిమీ చైతన్య రథాన్ని స్వయంగా హరికృష్ణ నడిపారు. ఆ వాహనాన్ని హరికృష్ణ అంత్యక్రియలకు ఉపయోగించే ఆలోచనని నందమూరి కుటుంబ సభ్యులు విరమించుకున్నట్లు తెలుస్తోంది.

ఆ వాహనం నందమూరి కుటుంబానికి ఓ జ్ఞాపికలా ఉంచాలని, అందువలనే వేరే వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. చైతన్య రథం ప్రస్తుతం రామకృష్ణ స్టూడియోలో ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో దానిని ఉపయోగిస్తున్నారు.


Click it and Unblock the Notifications











