Shankar:మణిరత్నం బాటలో శంకర్!.. నవల ఆధారంగా సినిమా.. ముగ్గురు స్టార్ హీరోలతో భారీ ప్లాన్?
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం భాతీయ సినిమాను ప్రపచంలో ఎల్లలు దాటేలా చేసింది. అప్పటివరకు హాలీవుడ్ వరకే పరిమితమైన గ్రాఫిక్స్, యుద్ధాలు, రాజ్యపాలన వంటి చిత్రాలను తెలుగులో ప్రయోగించారు. ఆ ప్రయోగాన్ని యావత్ ప్రపంచం మెచ్చుకుంది. ఆయన బాటలోనే చోళ రాజులకు సంబంధించిన కథతో పొన్నియన్ సెల్వన్ తెరకెక్కించారు లెజండరీ డైరెక్టర్ మణిరత్నం. ఈ సినిమా పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన దారిలోనో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ నడుస్తున్నారా అనిపిస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మరో పాన్ ఇండియా చిత్రం..
భారీ చిత్రాలను తెరకెక్కించే సౌత్ దర్శకుల్లో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఒకరు. సినిమాలో సన్నివేశాలు, పాటలు, గ్రాఫిక్స్ వంటి ప్రతి విషయంలో క్రియేటివిటీ, భారీతనం కనిపించడం శంకర్ డైరెక్షన్ స్టైల్. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీల్లో పాన్ ఇండియా స్టైల్ కొనసాగుతోంది. ఒక సినిమా పూర్తి చేశాక గానీ, మరో సినిమాను మొదలుపెట్టుకోని డైరెక్టర్ శంకర్ ఇప్పటికే రెండు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు మరో పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇటీవల లెజండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా అదే పేరుతో ఉన్న నవల ఆధారంగా రూపొందించిన విషయం తెలిసింది.

ఒక విజువల్ వండర్ అవుతుందని..
పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా సినిమాను రెండు భాగాలుగా తీసేందుకు ప్లాన్ చేశారు దర్శకుడు మణిరత్నం. ఇప్పుడు ఆయన బాటలోనే తమిళ ఇతిహాస నవల వేల్పరి ఆధారంగా సినిమాను వెండితెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు డైరెక్టర్ శంకర్. ఈ పుస్తకం నవల ఆధారంగా ఏకంగా మూడు భాగాలను చిత్రీకరించనున్నారట. ఈ సినిమా ఒక విజువల్ వండర్ అవుతుందని సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీగా ఖర్చు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాతో యాక్షన్ సన్నివేశాల్లో ఓ బెంచ్ మార్క్ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నారట.

ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్..
వేల్పరి కథ చాలా పెద్దది. అందుకే ఈ కథను ఒక సినిమాలో చూపించడం కష్టం కాబట్టి మూడు భాగాలుగా తెరకెక్కించాలనుకుంటున్నారట. వచ్చే ఏడాది షూటింగ్ మొదలుపెట్టనున్నారని టాక్. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ హీరో రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషించనున్నాడు. నిజానికి రణ్ వీర్ సింగ్ తో అపరిచితుడు రీమేక్ చేయాలనుకున్నారట డైరెక్టర్ శంకర్.
కానీ ఇప్పుడు ఆ ఆలోచిన మార్చి ఈ సినిమా తీయనున్నారట. అలాగే నవల ఆధారంగా తెరకెక్కించే సినిమాలో సూర్య, యశ్ ప్రధాన పాత్ర పోషించనున్నారని ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అంటే మూడు భాగాలకు ముగ్గురు హీరోలను సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియదు. ఇక డైరెక్టర్ శంకర్.. రామ్ చరణ్ తో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అలాగే విశ్వనటుడు కమల్ హాసన్ తో భారతీయుడు 2 చిత్రీకరణ ఆల్మోస్ట్ పూర్తి దశకు వచ్చిందని టాక్.


Click it and Unblock the Notifications











