Vemuri Balaram biopic వెండితెరపైకి స్వాతి మ్యాగజైన్ ఓనర్ లైఫ్ స్టోరి.. దర్శకుడు ఎవరంటే?
తెలుగు సాహితీ ప్రియులకు వేమూరి బలరాం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. స్వాతి అంటే వేమూరి బలరాం.. వేమూరి బలరాం అంటే స్వాతి అనే విధంగా సాహిత్యరంగంలో లెజెండ్‌గా నిలిచారు. గత 40 ఏళ్లుగా లక్షలాది మంది పాఠకుల హృదయాల్లో చోటు సంపాదించుకొన్నారు. అలాంటి ప్రముఖుడి జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనల ఆధారంగా బయోపిక్ తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శకుడు, రచయిత ప్రభాకర్ జైనీ. స్వాతి బలరాం.. అతడే ఒక సైన్యం అనే టైటిల్‌తో వస్తున్న బయోపిక్ వివరాల్లోకి వెళితే..
ప్రభాకర్ జైనీ దర్శకుడిగా : తెలుగు సినిమా పరిశ్రమలో క్యాంపస్ అంపశయ్య, ప్రణయ వీధుల్లో, ప్రజాకవి కాళోజి లాంటి చిత్రాల దర్శకుడిగా ప్రభాకర్ జైనీ ప్రేక్షకులకు సుపరిచితులు. జైనీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ బయోపిక్‌ను విజయలక్ష్మీ జైనీ నిర్మిస్తున్నారు. ప్రీ ప్రోడక్షన్ పనలు జోరుగా కొనసాగుతున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయిన వెంటనే సెట్స్‌పైకి వెళ్లనున్నారు.

కాళోజీ బయోపిక్ గురించి చెబుతూ: వేమూరి బలరాం బయోపిక్ గురించి ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ.. యువకుల నుంచి వృద్ధుల వరకు ప్రతీ ఒక్కరు స్వాతి మ్యాగజైన్ రహస్యంగా చదువుతారు. అలాంటి పత్రిక వెనుక ఉన్న శక్తి వేమూరి బలరాం గారు. కాళోజీ బయోపిక్ కోసం వందేమాతరం శ్రీనివాస్ కంపోజ్ చేసిన పాటను వేమూరి బలరాంకు చూపిస్తూ మాటల్లో పడిపోయాను. ఆ సందర్భంగా ఆయన బయోపిక్ గురించి ప్రస్తావన తీసుకొచ్చాను. అయితే పలుమార్లు చర్చించిన తర్వాత ఆయన బయోపిక్ తీసేందుకు అనుమతించారు. దాంతో ఈ సినిమాకు నేను రెమ్యునరేషన్ తీసుకొనని చెప్పడంతో ఆయన కూడా సంతోషించారు అని చెప్పారు.

కొడాలి, ఘంటసాల గ్రామాల్లో : వేమూరి బలరాం బయోపిక్‌కు ఒప్పుకొన్న తర్వాత ఆయన జీవితానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మొదలుపెట్టాను. ఈ క్రమంలో బయోపిక్‌కు సంబంధించిన పాటను రికార్డ్ చేసి సినీ పరిశ్రమలోనే పెద్దలకు వినిపించగా మంచి స్పందన లభించింది. కొడాలి, ఘంటసాల గ్రామాల్లో ఆయన ఆఫీస్, ఇంటికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను షూట్ చేశాం అని ప్రభాకర్ జైనీ తెలిపారు.
యంగ్ వేమూరి బలరాం పాత్ర కోసం: వేమూరి బలరాం బయోపిక్ కోసం ఆయన యవ్వనంలో ఉన్న పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నాం. యంగ్ వేమూరి బలరాం పాత్ర కోసం నటించాలనుకొనే ఔత్సాహికులు నుంచి దరఖాస్తులు, ఫోటోలు కోరడం జరిగింది. ఔత్సాహికులు [email protected] ఈమెయిల్‌కు వివరాలు పంపించాలని కోరుతున్నాం ప్రభాకర్ జైనీ వివరించారు.

టీమ్ స్వాతి బలరాం అతడే ఒక సైన్యం
ఎడిటర్: రవికుమార్ కొండవీటి
స్టూడియో: డ్రీమ్ స్టూడియో
లిరిక్స్: ప్రభాకర్ జైనీ
కెమెరా: తిరుపతి రెడ్డి కోట
సంగీతం: శ్రీధర్ ఆత్రేయ
బ్యానర్: జైనీ క్రియేషన్స్
నిర్మాత: విజయలక్ష్మీ జైనీ
దర్శకత్వం: ప్రభాకర్ జైనీ


Click it and Unblock the Notifications











