తెలుగులో రీమేక్ కానున్న ధనుష్ అసురన్... హీరో ఎవరంటే?
తమిళ నాట సంచలనంగా మారిని ధనుష్ అసురన్ సినిమా తెలుగులోకి రాబోతోంది. చిత్రాన్ని వీక్షించిన ప్రతీ ఒక్కరూ జాతీయ అవార్డు రావాల్సిందేనని నొక్కి చెబుతున్నారు. అసురన్ చిత్రంలో ధనుష్ నటనను అందరూ పొగిడేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ అసురన్, ధనుష్‌పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
ధనుష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిల్చిన అసురన్.. ప్రస్తుతం 150 కోట్లను కొల్లగొట్టి బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను పెంచేసింది. దీంతో ఆ ఫీట్‌ను సాధించిన మొదటి చిత్రంగా అసురన్ రికార్డులకెక్కింది. అంతటి సంచలనం సృష్టించిన.. సృష్టిస్తోన్న అసురన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు రంగం సిద్దమైంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించబోతోన్నట్లు ప్రకటించారు. సామాజిక కోణాలను స్పృశించే అసురన్ లాంటి కథకు, వెంకీ నటన తోడైతే తెలుగులోనూ ప్రభంజనం సృష్టించడం ఖాయమే. ఈ రీమేక్‌కు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











