వెంకటాద్రిగా మెప్పిస్తా :వెంకటేష్

ఇక దర్శకుడు గోపిచంద్ గురించి చెపుతూ...గోపీచంద్ మంచి డైరెక్టర్. సింపుల్ అండ్ సిన్సియర్. అతనితో మంచి రాపో కుదిరింది. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు మంచి కెమెరా పనితనం చూపించాడు. బెల్లంకొండ సురేశ్‌తో ఇది నాకు రెండో సినిమా. అతను మంచి నిర్మాత. చక్కని నిర్మాణ విలువలతో తీశాడు. మిగతా సినిమాలన్నింటి కంటే భారీ ఎత్తున చేశాడు. ఇటీవలి కాలంలో చూడని చాలా అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపారు. దానికి నేను గ్యారంటీ అన్నారు. 'బాడీగార్డ్' వచ్చిన తీరుకి చాలా హ్యాపీగా ఉన్నా. జనవరి 12న రిలీజ్. సంక్రాంతికి మంచి ఆల్‌రౌండ్ సినిమా అవుతుంది. మంచి ఎంటర్‌టైనర్. ఫ్యామిలీ డ్రామా, చక్కని సంగీతం ఉన్నాయి. తమన్ చాలా బాగా సంగీతం ఇచ్చాడు. తొలిసారి అతనితో కలిసి పనిచేశా. ఇతర సినిమాలకంటే ఎక్కువగా దీన్ని సంగీతభరిత చిత్రం చేశాడు. అతనిచ్చిన నేపథ్య సంగీతం గురించి కూడా చెప్పుకుంటారు అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











