twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ నిర్మాత "కాశీ సమాధి" చూసి అవాక్కయిన పోలీసులు.... అమ్మాయిలతో పట్టుబడ్ద వేందర్ మదన్ ..

    ఆరునెలల క్రితం కాశీకి వెళ్లి సమాధి అవుతానంటూ లేఖ రాసిపెట్టి మాయమైన వేందర్‌ మూవీస్‌ మదన్ ఆచూకీ ఇన్నాళ్ళకి దొరికింది. అతని "సమాధి" ఎలా ఉందో చూసి షాక్ తిన్నారు.

    |

    ఆరునెలల క్రితం కాశీకి వెళ్లి సమాధి అవుతానంటూ లేఖ రాసిపెట్టి మాయమైన వేందర్‌ మూవీస్‌ మదన్ ఆచూకీ ఇన్నాళ్ళకి దొరికింది. తాను నమ్మిన వాళ్ళే తనక్ను మోసం చేసారనీ తాను ఇక బతకటం అనవసరం అనుకుంటున్నాననీ. ఇక తనకోసం వెతకొద్దనీ చెప్తూ రాసిన లేఖని చూడగానే తమిళ ఇండస్ట్రీలో కలకలం రేగింది. అతని కోసం పోలీసు బృందాలూ, కుటుంబసభ్యులూ, స్నేహితులూ అందరూ వెతుకులాట మొదలు పెట్టారు. మదన్ చనిపోయి ఉంటాడని అతన్ని ఇక చూడలేమనీ సన్నిహితులందరూ కొన్నాళ్ళు భాదపడ్డారు. అయితే అతని చుట్టూ ఉన్న కేసు చిన్నదేం కాదు అతనే కీలకం కావటం తో పోలీసులు మాత్రం వెతుకులాట ఆపలేదు.

    అయితే తాజాగా అతన్ని పట్టుకున్న పోలీసులు మన నిర్మాత గారి "సమాధి" ఎలా ఉందో చూసి షాక్ తిన్నారు అజ్ఞాతంలో సకల భోగాలను అనుభవిస్తూ ఉల్లాసవంతమైన జీవితాన్ని గడిపాడు. గత మే నెలలో పరారైనప్పటి నుంచి మదన్ తన ప్రియురాళ్లతోనూ, అందమైన యువతులతోనే సంబంధాలు పెట్టుకుని హరిద్వార్‌, గోవా తదితర నగరాలకు వారిని వెంటబెట్టుకునే తిరగాడు. ఈ వివరాలన్నీ క్రైం పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మరిన్ని విషయాలు చూడండి.

    తీవ్ర సంచలనం:

    తీవ్ర సంచలనం:

    వేందర్ మూవీస్ మదన్ గంగలో సమాధి అవుతానని లేఖ రాసి పెట్టి అదృశ్యం అయిన సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. దీంతో ఆయనను వెదుక్కుంటూ భార్య, మిత్రులు కాశీకి బయల్దేరారు. వేందర్ మూవీస్ సంస్థాపకుడు మదన్. ఈయన 2011లో ఈ సంస్థను ప్రారంభించి 'అరవాన్', విశాల్ నటించిన పాండియనాడులతో సహా పలు చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా 20 సినిమాలకు పైగా డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు.

    వేందర్ మూవీస్:

    వేందర్ మూవీస్:

    ఈయన ఎస్‌ఆర్‌ఎం విద్యాసంస్థల అధ్యక్షుడు పచ్చముత్తుకు సన్నిహితుడు. వేందర్ అని పిలవబడే పచ్చముత్తు తరఫున వేందర్ మూవీస్ అనే సంస్థను ప్రారంభించారు. అంతేకాకుండా ఎస్‌ఆర్‌ఎం కళాశాలలో అడ్మిషన్ల భర్తీకి మదన్‌కు పూర్తి స్వేచ్ఛ ఉంది. విద్యార్థులు చెల్లించే డొనేషన్ మదన్ ద్వారా కళాశాలకు చేరుతుంది. ఈ స్థితిలో వేందర్ మూవీస్ లెటర్ హెడ్‌లో ఐదుపేజీల లేఖను రాసిపెట్టి మదన్ అదృశ్యం అయ్యారు.

    నిజాయితీగా:

    నిజాయితీగా:

    ఈ లేఖ జిరాక్స్‌ను వాట్సప్ ద్వారా సినిమా, పత్రికల్లోని స్నేహితులకు పంపారు. అంతేగాకుండా సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. ఆ లేఖలో తాను కాశీలోని గంగలో సమాధి అవుతానని తెలిపారు. తాను ఎంతో నిజాయితీగా, నిస్వార్థంగా పచ్చముత్తు వద్ద పనిచేశానని, కొందరు తనపై చాడీలు చెప్పి మా ఇద్దరి మధ్య వున్న స్నేహాన్ని దెబ్బతీశారని, ఐజేకే పార్టీ అభివృద్ధి కోసం తాను ఎంతో కష్టపడినట్లు మదన్ తెలిపారు. ఈ స్థితిలో విరక్తి చెందిన తాను ఇకపై ప్రాణాలతో బతికి ఉండడం వృథా అని పేర్కొన్నారు. దీంతో అతను ఎక్కిడికి వెళ్లాడనే ఆచూకీ తెలియలేదు.

    మెడికల్ సీట్ల పేరున :

    మెడికల్ సీట్ల పేరున :

    దీంతో వైద్యసీట్ల పేరుతో కోట్లాది రూపాయలు కాజేశారని పచ్చముత్తుపై ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులకు సైతం ఫిర్యాదులు చేశారు. దీంతో మదన్ ఎక్కడున్నాడో కనుగొని కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా పోలీసులను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. మెడికల్ సీట్ల పేరున విద్యార్థుల నుంచి ఎస్‌ఆర్‌ఎంవారు భారీగా వసూలు చేశారని మదన్ తల్లి తంగం హైకోర్టులో మరో పిటిషన్ వేశారు.

    రూ.72 కోట్లకు పైగా:

    రూ.72 కోట్లకు పైగా:

    ఇంత వరకు 112 మంది నుంచి రూ.72 కోట్లకు పైగా వసూలు చేశారని, మరికొందరు విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.మిగిలిన ఫిర్యాదులు కూడా అందితే మోసం సొమ్ము వందకోట్లు దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. విద్యార్థుల నుంచి సొమ్ము వసూలు చేసింది మదనే అయినా...

     సెంట్రల్ క్రైంబ్రాంచ్ :

    సెంట్రల్ క్రైంబ్రాంచ్ :

    వర్సిటీ చాన్సలర్‌గా పచ్చముత్తునే బాధ్యత వహించాలని బాధిత తల్లిదండ్రులు పోలీసుల వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా మదన్ ఆచూకీ, ఆరోపణలపై నిజాలు వెలికితీసేందుకు సెంట్రల్ క్రైంబ్రాంచ్ అదనపు సహాయ కమిషనర్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది.

    కాశీ వెళ్లి సమాధి కాబోతున్నట్లు:

    కాశీ వెళ్లి సమాధి కాబోతున్నట్లు:

    ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం వైద్య కళాశాలలో వైద్య కోర్సులకు డొనేషన్లు వసూలు చేయడంలో కీలక పాత్ర పోషించడంతోపాటు వేందర్‌ మూవీస్‌ పేరుతో సినీ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో తమిళ సినిమాలు నిర్మించిన మదన్ గత మే నెల 28న ఉన్నట్టుండి అదృశ్యమయ్యారు. కాశీ వెళ్లి సమాధి కాబోతున్నట్లు లేఖరాసి పెట్టివెళ్లిన మదన ఆచూకీ కోసం ఆయన స్నేహితులు కాశీ తదితర ప్రాంతాల్లో తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు.

    కేసులను విచారణ :

    కేసులను విచారణ :

    మదన్ తల్లి ఆర్‌ఎస్‌ తంగం తన కుమారుడి ఆచూకీ కనుగొనేందుకు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు మదన్ అదృశ్యం కేసు, ఆయనపై నమోదైన కేసులను విచారణ జరిపేందుకుగాను ప్రత్యేక అధికారిని నియమించాలని పోలీసులకు ఉత్తర్వులిచ్చారు. ఆ మేరకు అడిషనల్‌ అసిస్టెంట్‌ పోలీసు కమిషనర్‌ రాధాకృష్ణన్ విచారణాధికారిగా నియమితులయ్యారు.

    అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ:

    అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ:

    ఇలా ఆరునెలలు గా గాలింపు జరుగుతూనే ఉంది... ఇక తాజాగా మదన్ ని ట్రేస్ చేసిన పోలీస్ బృందం అతన్ని అరెస్ట్ చేసారు. అయితే సమాధి అవుతాను అంటూ మాయమైన మదన్ సమాధినీ అక్కడ ఉన్న అమ్మాయిలనూ చూసి షాక్ తిన్నారు పోలీసులు. ఇద్దరు అమ్మాయిలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించాడు మదనుడు.

    అమ్మాయిలతో సన్నిహిత సంబంధాలు:

    అమ్మాయిలతో సన్నిహిత సంబంధాలు:

    ఎస్సారెమ్‌ యూనివర్శిటీ మెడిసిన్ సీట్లిప్పిస్తానంటూ విద్యార్థుల నుంచి వసూలు చేసిన సుమారు రూ.84 కోట్లతో పరారయ్యేందుకు సిద్దమై రెండోభార్యకు వడపళనిలో ఓ ప్లాటును, మొదటి భార్యకు కేరళలో ఓ ఇంటిని కొనిచ్చాడు. ఇక వేందర్‌ మూవీస్‌ అధినేతగా ఉన్నప్పుడు మదన్ వద్దకు సినిమా ఛాన్సుల కోసం అతడి చుట్టూ తిరిగిన వర్ష అనే యువతిని తన బుట్టలో వేసుకున్నాడు. ఆ తర్వాత గీతాంజలి, మెర్సియా సహా పలువురు అమ్మాయిలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

    60 లక్షలతో లగ్జరీ కారు:

    60 లక్షలతో లగ్జరీ కారు:

    గీతాంజలితోనే ఆయన తన అజ్ఞాతవాసాన్ని హరిద్వార్‌ నుంచి ప్రారంభించాడు. గీతాంజలి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలియగానే ఆమెను వెనక్కి పంపాడు. ఆ తర్వాత రెండు నెలలపాటు గోవా, బెంగుళూరు, కల్‌కత్తా తదితర ప్రాంతాల్లో సంచరించాడు. రూ.60 లక్షలతో లగ్జరీ కారు కొన్నాడు. 10 ఎకరాల ఫామ్‌హౌస్‌ కొన్నాడు. పూనాలో కొంతకాలం గడిపిన తర్వాత తిరుప్పూరులో దాగి ఉండాలని మదన్ నిర్ణయించాడు.

    వివాహేతర సంబంధం:

    వివాహేతర సంబంధం:

    అప్పటికే తిరుప్పూరుకు చెందిన వర్ష అనే వితంతువుతో మదన్ కు రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. కనుకనే ఆయన తిరుప్పూరులో దీపావళినాడు వర్షతోపాటు బంగళాలో రహస్యంగా కాపురం పెట్టాడు. ఆ బంగళాలో ఉన్నప్పుడు మదన్ నైటీ వేసుకుని ఆడదానిలా సంచరించేవాడు. గీతాంజలి బంధువైన శేఖర్‌ వద్ద పోలీసులు జరిపిన విచారణ వల్ల మదన్ దాగిన చోటును తెలుసుకోగలిగారు. ప్రస్తుతం జైలులోఉన్న మదన్ ను పది రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ జరపాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

    English summary
    After five months of suspense and high drama, the police arrested producer S. Madhan of Vendhar Movies on Sunday in Tirupur. With this, all the swirling rumours about his whereabouts have been put to rest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X