రాజమౌళి వెకేషన్ విశేషాలేంటంటే...!?
'మర్యాద రామన్న" చిత్రం తర్వాత రాజమౌళి వెకేషన్ తీసుకోవాలనుకున్నాడు తన ఫ్యామిలీతో కలిసి వెన్నిస్, గ్రీక్, ఐల్యాండ్స్ కి టూర్ వెళ్లాడు. 12 రోజుల పాటు ఈ టూర్ చాలా హాయిగా సాగిందని రాజమౌళి చెప్పాడు. కాకపోతే 12వ రోజు ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వచ్చేద్దామా అనిపించిందట. ఈ టూర్ ని హ్యాపీగా ఎంజాయ్ చేసి భాగ్యనగరానికి కొత్త ఉత్సాహంతో చేరుకున్నాడు ఈ డైరెక్టర్ గారు.
వెన్సిస్, గ్రీక్ లో సముద్రాలు ముదురు నీలం రంగులో ఉన్నాయని, పడవలో వెళుతున్నప్పుడు ఇంక్ లో ప్రయాణం చేస్తున్నట్టు అనిపించిందని తన అనుభూతులను పంచుకున్నాడు రాజమౌళి. హైదరాబాద్ లో అడుగుపెట్టిన తర్వాత తన వదిన చేసిన పప్పుచారు, చికెన్ కర్రీ తింటుంటే ఇంతకు మించిన ఆనందం ఏం ఉందనిపించిందని కూడా చెప్పాడు.
రాజమౌళి మర్యాద రామన్న సునీల్ సలోని మగధీర రామ్ చరణ్ తేజ్ ఈగ rajamouli maryada ramanna sunil saloni magadheera ram charan teja eega


Click it and Unblock the Notifications