మహర్షి అద్భుతం.. మహేష్ నటన భేష్.. ఉపరాష్ట్రపతి పొగడ్తల వర్షం

వరుస పెట్టి మెస్సేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ సమాజం పట్ల, సామాజిక అంశాల పట్ల తనకున్న ఇష్టాన్ని చాటుకుంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో ఎంతో విలువలతో కూడిన సందేశాన్నిచ్చారు. దీంతో మహేష్ అభిమానులతో పాటు దేశంలోని సినీ తారలు, పొలిటిషన్స్ మహేష్‌ని మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పటికే మహర్షి సినిమాను ప్రశంసిస్తూ పలువురు స్టార్స్ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చగా తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోషల్ మీడియా వేదికగా మహర్షి సినిమాపై తన స్పందనను తెలిపారు. వివరాల్లోకెళితే..

కుటుంబంతో కలిసి చూశా..

కుటుంబంతో కలిసి చూశా..

మహర్షి సినిమాకు వస్తున్న టాక్ విని కుటుంబంతో కలిసి సినిమా కెళ్ళానని ఆయన తెలిపారు. ఇది ఎంతో అద్భుతమైన చిత్రమని, చిత్రంలో మహేష్ నటన భేష్ అని ఆయన పొగిడారు. సహజమైన నటనతో మహేష్ చక్కని ప్రతిభ కనబర్చారని అన్నారు. రైతు నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తు చేశారని పేర్కొంటూ ట్వీట్స్ పెట్టారు వెంకయ్య నాయుడు.

అన్నదాత ఆవశ్యకతను తెలిపిన ప్రభోదాత్మక చిత్రం

అన్నదాత ఆవశ్యకతను తెలిపిన ప్రభోదాత్మక చిత్రం

గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను వివరిస్తూ అన్నదాత ఆవశ్యకతను తెలిపిన ప్రభోదాత్మక చిత్రం మహర్షి అని ఆయన కొనియాడారు. ప్రతీ ఒక్కరూ చూడదగిన మంచి సినిమా ఇదని తెలుపుతూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు వెంకయ్య నాయుడు.

గతంలో కూడా..

గతంలో కూడా..

గతంలో కూడా మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమాపై వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీమంతుడు ఒక సందేశాత్మక చిత్రమని, సినిమా చూస్తుంటే తన చిన్నతనం గుర్తుకొచ్చిందని వెంకయ్యనాయుడు స్పందించారు. తాజాగా మరోసారి మహేష్ మహర్షి సినిమాపై అదే వెంకయ్యనాయుడు సానుకూలంగా స్పందించడం విశేషం.

మహేష్‌పై కేటీఆర్ ప్రశంసలు

మహేష్‌పై కేటీఆర్ ప్రశంసలు


ఇక మహేష్ గత సినిమా భరత్ అనే నేను సినిమాపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఏ రేంజ్‌లో ప్రశంసలు గుప్పించారో తెలిసిందే. ప్రజాజీవితంపై తీసిన సినిమా భరత్ అనే నేను అని, ఆ సినిమా చూసి తాను చాలా బాగా ఎంజాయ్ చేశానని అన్నారు. చిత్రంలో మహేష్‌బాబు పోషించిన ముఖ్యమంత్రి పాత్ర ఎంతో స్ఫూర్తిదాయకమైందని ఆయన పేర్కొన్నారు.

మహర్షి హవా

మహర్షి హవా

మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ సినిమాగా వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి సినిమా తన హవా కొనసాగిస్తూనే ఉంది. మే 9న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరిపోయి మహేష్ కెరీర్‌లో బెస్ట్ సినిమాగా రికార్డ్ నమోదు చేసే దిశగా పరుగులు పెడుతోంది. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ లాంటి ముగ్గురు బడా నిర్మాతలు రూపొందించిన ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే చిందులేయగా అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X