twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్‌పై ప్రశంసలు గుప్పించిన ఉప రాష్ట్రపతి.. తమన్నాపై కామెంట్స్

    |

    చారిత్రాక సినిమా 'సైరా నరసింహా రెడ్డి' సినిమాను దేశ, రాష్ట్ర రాజకీయ ప్రముఖులకు చూపించాలనే కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ నేపథ్యంలోనే నిన్న (బుధవారం) ఢిల్లీ వెళ్లిన చిరంజీవి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో ప్రత్యేకంగా సమావేశమై 'సైరా నరసింహా రెడ్డి' సినిమా విశేషాలు తెలిపారు.

    మొదట ప్రధాని మోదీని కలిసి.. ఆ వెంటనే

    మొదట ప్రధాని మోదీని కలిసి.. ఆ వెంటనే

    నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన మెగాస్టార్.. మొదట ప్రధాని మోదీ, అమిత్ షాలను కలిసి సైరా సినిమా చూడాలని కోరినట్టు సమాచారం. అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసానికి చేరుకున్న చిరంజీవి.. వెంకయ్య నాయుడుతో కలిసి ఆయన ఇంట్లోనే సైరా సినిమా వీక్షించారు.

    రామ్ చరణ్ గొప్ప నిర్ణయం

    రామ్ చరణ్ గొప్ప నిర్ణయం

    సైరా నరసింహారెడ్డి సినిమా చూసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ చిత్రాన్ని చూసిన ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఎంతో బాగుందని, తెలుగులో ఎంతో మంచి సినిమా తీశారని ఆయన అభినందించారు. ఇలాంటి వీరుడి చరిత్రకు చిత్ర రూపమివ్వడం ఎంతో గొప్ప నిర్ణయమని పేర్కొంటూ నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్‌రెడ్డిలను అభినందించారు.

    చిరంజీవి నటన ప్రేరణాదాయకం

    చిరంజీవి నటన ప్రేరణాదాయకం

    ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఇంత అద్భుతమైన సినిమా రూపొందించిన రామ్ చరణ్‌కి తన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని వెంకయ్య నాయుడు అన్నారు. మంచి ప్రతిభ గల దర్శకుడు సురేందర్ రెడ్డి అని, ఇక సినిమాలో చిరంజీవి నటన చాలా చక్కగా, ప్రేరణా దాయకంగా ఉందని వెంకయ్య నాయుడు తెలిపారు.

    తమన్నా గురించి స్పెషల్‌గా

    సైరా నరసింహా రెడ్డి సినిమాలో నర్తకి లక్ష్మి పాత్రలో నటించిన తమన్నా గురించి స్పెషల్ గా మాట్లాడారు వెంకయ్య నాయుడు. సైరాలో ధీర వనితగా తమన్నా అభినయం భేష్ అంటూ తెగ పొగిడారు. అమితాబ్ బచ్చన్, నయనతార ఇలా అందరు నటీనటులు బాగా నటించారని, ఇలాంటి ప్రేరణాత్మక సినిమాలు మరిన్ని రావాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.

    చిరంజీవి రియాక్షన్

    చిరంజీవి రియాక్షన్

    ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమయం తీసుకుని మరీ 'సైరా నరసింహా రెడ్డి' సినిమాను చూడటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. గతంలో కూడా సైరాపై తెలంగాణా గవర్నర్ తమిళ సై, ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

    English summary
    Chiranjeevi met PM YS Jagan Narendra Modi and Venkaiah Naidu. He watched His latest movie Sye Raa Narasimha Reddy promotions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X