ఎస్పీ బాలు హాస్పిటల్ బిల్లులపై వివాదం.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె క్లారిటీ

సుప్రసిద్ద గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణంతో ప్రపంచవ్యాప్తంగా సంగతీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. దాదాపు 50 రోజులకుపైగా మృత్యువుతో పోరాటం చేసిన ఎస్పీ బాలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే చెన్నై ఎంజీఎం హాస్పిటల్‌లో ఎస్సీ బాలు కుటుంబ సభ్యులు చెల్లించిన బిల్లు ఇదే అంటూ మీడియాలో ఓ పత్రం విస్తృతంగా ప్రచారమైంది. అయితే ఎస్పీ బాలు హాస్పిటల్ బిల్లుపై అనేక ఊహాగానాలు రావడంతో ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ క్లారిటీ ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే..

50 రోజులకుపైగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ

50 రోజులకుపైగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ

ప్రఖ్యాత గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆగస్టు 5వ తేదీన కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరారు. ఆ తర్వాత 13 తేదీన ఆయన ఆరోగ్యం మరింత దిగజారింది. అప్పటి నుంచి ఎస్పీ బాలుకు ఎక్మో, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. దాదాపు 51 రోజులు ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 25వ తేదీన కన్నుమూశారు.

హాస్పిటల్ బిల్లులుపై సోషల్ మీడియాలో ప్రచారం

హాస్పిటల్ బిల్లులుపై సోషల్ మీడియాలో ప్రచారం

అయితే ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందిన కాలంలో ఎస్పీ బాలు కుటుంబ సభ్యులు చెల్పించిన బిల్లు అంటో వార్త, ఓ ఫోటో సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారమైంది. అయితే ఆ బిల్లును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ చెల్లించారనే వార్తలపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు.

Recommended Video

Telugu Cinema Paataku Praanam Nuvvu | Ravi Varma Potedar's Song On SPB
హాస్పిటల్ బిల్లులపై అసత్య ప్రచారం

హాస్పిటల్ బిల్లులపై అసత్య ప్రచారం

దివంగత ఎస్పీ బాలు వైద్యానికి అయిన బిల్లును చెల్లించినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. ఆ వార్తలన్నీ ఊహాగానాలే. అలాంటి వార్త వాట్సాప్, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడం బాధ కలిగించింది. దయచేసి అలాంటి వార్తలను ఫార్వర్డ్ చేయకండి. దీపా వెంకట్ కోరారు. బాలు మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడం వల్ల మాకు బాధకలిగిందనే విషయాన్ని తెలిపారు.

రెండు వారాల క్రితమే హాస్పిటల్ యాజమాన్యం

రెండు వారాల క్రితమే హాస్పిటల్ యాజమాన్యం

అంతేకాకుండా ఎస్పీ బాలసుబ్రమణ్యంకు సంబంధించిన బిల్లులపై కూడా క్లారిటీ ఇచ్చారు. రెండు వారాల క్రితమే ఎస్పీ బాలు బిల్లులు చెల్లించనవసరం లేదని హాస్పిటల్ యాజమాన్యం వెల్లడించారు. ఎస్పీ బాలుకు మెరుగైన వైద్యం అందించారు. బాలుకు అందించిన వైద్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకొన్నాను. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి నాన్నగారు కూడా ఎప్పటికప్పుడు వాకబు చేశారు. స్వయంగా నేను కూడా సమాచారం అందించాను అని దీప వెంకట్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్పీ బాలు కుటుంబం మాకు దగ్గరైనందున హస్పిటల్ యాజమాన్యం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి మాకు తెలియజేశారని వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X