twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు!

    By Bojja Kumar
    |

    మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కబోతున్న బయోపిక్ మార్చి 29, 2018న హైదరాబాద్‌ నాచారంలోని రామకృష్ణ స్టూడియోలో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఉదయం 9.42 నిమిషాలకు ప్రారంభోత్సవ ముహూర్తం నిర్ణయించారు. రాష్ట్రపతి రాక సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు.

    ఈ బయోపిక్‌లో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషించనున్నారు. తేజా దర్శకత్వం వహిస్తారు. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణువర్దన్ ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రూపొందించనున్నారు.

    Venkaiah Naidu to grace NTR biopic muhurat

    ఎన్టీఆర్ బయోపిక్ అనౌన్స్ చేసినప్పటి నుండే ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రంలో ఏం చూపించబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే వివాదాల జోలికి పోకుండా నిమ్మకూరులో ఎన్టీఆర్ జీవితం ప్రారంభమైనప్పటి నుండి సినిమా ఇండస్ట్రీలో ఆయన అంచెలంచెలుగా ఎదిగిన పరిణామాలను ఫోకస్ చేస్తూ రాజకీయాల వైపు సాగించిన ప్రయాణం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంతో సినిమా ముగింపు ఉంటుందని తెలుస్తోంది.

    English summary
    Muhurat of the much-awaited Telugu film on the life of veteran actor Nandamuri Taraka Rama Rao will be held at Ramakrishna Studios in Hyderabad on Thursday morning. Vice President M Venkaiah Naidu gave his nod to attend the event as the chief guest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X