వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం.. వారసులమని కొందరు పాలిటిక్స్‌లోకి వచ్చి.. వెంకయ్య సంచలన వ్యాఖ్యలు
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజు సెప్టెంబర్ 20వ తేదీన ఆయన జన్మదినాన్ని ఘనంగా సినీ ప్రముఖులు, అభిమానుల జరుపుకొంటారు. అయితే ఈ ఏడాది ఆయన 100 పడిలోకి ప్రవేశించారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకున్నా అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు అక్కినేని నాగేశ్వరరావు 100వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకొంటున్నారు.
శత జయంతి ఉత్సవాల సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకు మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మోహన్ బాబు, అనుపమ్ ఖేర్, మురళీ మోహన్ రావు, నాని, మహేష్ బాబు, నమ్రత తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..

తెలుగు వారి కట్టు, బొట్టు, భాష, యాస, గోస తెలుగు వారికి అడ్రస్. తెలుగు భాషను విస్మరిస్తే మన అస్థిత్వాన్ని కోల్పోతాం. గుడివాడకు అటు ఇటు పుట్టిన ఇద్దరు మహనీయులు ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ ఇద్దరు సినిమా పరిశ్రమకు, కళామతల్లికి రెండు కళ్లుగా మారారు. నాగేశ్వరరావు తన జీవితాన్ని ఎప్పుడూ మదింపు చేసుకొనే వారు. దాని వల్ల ఆయన వ్యక్తిత్వాన్ని పెంచుకొన్నారు. అందుకే విప్రనారాయణ, మహాకవి కాళిదాసు లాంటి పాత్రలు పోషించారు. అక్కినేని నాగేశ్వరరావు నటనా విశ్వవిద్యాలయం. ప్రతీ నటుడు ఆయన పాటించిన విలువలు, లక్షణాలను పుణికిపుచ్చుకోవాలి అని వెంకయ్య నాయుడు అన్నారు.
అక్కినేని నాగేశ్వరరావు 90 ఏళ్ల పాటు పరిపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించారు. ఆయన చివరి వరకు నటిస్తూనే ఉన్నారు. కొందరు తమ జీవితకాలం మాత్రమే జీవిస్తారు. కానీ అక్కినేని నాగేశ్వరరావు జీవితాకాలం ముగిసిన తర్వాత కూడా జీవిస్తూనే ఉంటారు. ఆయన లేకపోయినా అభిమానులు, తెలుగు ప్రజల హృదయాల్లో జీవిస్తారు. ఆయన పరిణితి కలిగిన ఆశావాది. ఆయన నాస్తికుడైనప్పటికీ.. ఆయన గొప్ప తాత్వికుడు అనే విషయాన్ని గమనించాలి అని వెంకయ్య నాయుడు అన్నారు.

వాస్తవభౌతిక పరిస్థితులను ఆకలింపు చేసుకొన్న జీవించిన వ్యక్తి నాగేశ్వరరావు. పోటీ ప్రపంచంలో నెగ్గాలనే కసి ఉన్న వ్యక్తి. నాపై ఎంతో ఆత్మీయంగా ఉన్నారు. నాపై పితృవాత్యల్యం చూపించేవారు. ఆయన పెద్దగా చదువుకోలేకపోయినా జీవితాన్ని బాగా చదివారు. జీవితంలో నేర్చుకొన్నదానని ఆచరణలో పెట్టి చూపించుకొన్నారు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అని మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.
జీవితంలో పోరాటం చేసిన అక్కినేని నాగేశ్వరరావు ఎన్నడూ ఓడిపోలేదు. ఆయన జీవిత పరమార్థం పొందితే ఈ తరం యువతకు ఎంతో స్పూర్తిగా నిలుస్తుంది. ఆయనలో కష్టపడే తత్వం ఎంతో ఎత్తులో నిలబెట్టింది, విద్యాదానం చేసి భారతీయ సంస్కృతిని చాటి చెప్పాడు. తన వల్ల మంచి జరగకపోయినా.. చెడు జరగకూడదు అని బలంగా నమ్మిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. ప్రతీ సినిమా ద్వారా సందేశాన్ని అందించేవారు. గతానికి వర్తమానానికి సినిమా వారధి. సినిమాలు సమాజానికి మేలు చేయాలి అని వెంకయ్యనాయుడు చెప్పారు.

కొన్ని సినిమాల్లో వాడే భాష అభ్యంతరకరంగా ఉంటున్నది. సినిమా ప్రభావం ప్రజలపై ఎక్కువ. కాబట్టి సినీ ప్రముఖులు ఈ విషయాన్ని గుర్తు చేసుకొని సినిమాలో భాష విషయంలో విలువలు పాటించాలి అని అన్నారు. ప్రెస్ మీట్ పెట్టి నా జీవితం బాగా లేదు అని చెప్పిన ఘనత ఆయనకే చెందింది. విలువలను, కట్టుబాట్లను పాటిస్తే.. అక్కినేని నాగేశ్వరరావుకు ఘన నివాళి అందించినట్టే అని వెంకయ్య నాయుడు తెలిపారు
రాజకీయాల్లో వారసత్వానికి నేను వ్యతిరేకం. కొందరు వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన వారి గురించి మాట్లాడటం బాగుండదు. కానీ విద్య, వైద్యం, వ్యాపార రంగాల్లో వారసత్వాన్ని ప్రోత్సహిస్తాను. జవసత్వాలు ఉంటేనే వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తారు. అలాంటి విలువలు పాటిస్తూ అక్కినేని కుటుంబ సభ్యులు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు అని వెంకయ్య నాయుడు సలహా ఇచ్చారు.


Click it and Unblock the Notifications











