ANR Lives On: గ్రాండ్‌గా ఏఎన్నార్ విగ్రహం ఆవిష్కరణ.. మహేశ్, చరణ్‌తో పాటు ఏ హీరోలు వచ్చారంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేకమైన ముద్రను వేసుకుని.. దాదాపు ఆరు దశాబ్దాల పాటు తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన లెజెండరీ హీరో అక్కినేని నాగేశ్వర్రావు. నటనకు కొత్త రూపును పరిచయం చేస్తూ ఎన్నో వైవిధ్యమైన పాత్రలను చేసిన ఆయన.. తెలుగు చిత్ర పరిశ్రమ కోసం జీవితాన్ని దారపోశారు. అలాంటి దిగ్గజ నటుడు ఏఎన్నార్ నేడు (సెప్టెంబర్ 20, 2023) 100వ జయంతిని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది మొత్తం శతజయంతి ఉత్సవాలను జరపబోతున్నారు.
లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర్రావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో ఆవరణలో ఆయన పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదగా ఆవిష్కరించారు. ఇందుకోసం అక్కినేని నాగార్జున, సుశీల అధ్వర్యంలో వాళ్ల ఫ్యామిలీ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. దీన్ని ఎంతో గ్రాండ్‌గా జరిపారు.

దిగ్గజ నటుటు అక్కినేని నాగేశ్వర్రావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎన్నార్ తెలుగు సినిమా పరిశ్రమ కోసం చేసిన సేవలను, ఉమ్మడి ఆంధ్ర రాష్టానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. అదే సమయంలో తెలుగు భాష కోసం అక్కినేని చేసిన కార్యక్రమాలను సైతం గుర్తు చేసుకున్నారు.

ఎంతో వైభవంగా జరిగిన ఏఎన్నార్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అక్కినేని ఫ్యామిలీతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్ బాబు, రామ్ చరణ్, నేచురల్ స్టార్ నాని, మంచు విష్ణు, శ్రీకాంత్, దర్శకధీరుడు రాజమౌళి, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు. వీళ్లతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, భాషావేత్తలు సైతం విచ్చేశారు.
ఇదిలా ఉండగా, ఏఎన్నార్ శత జయంతి ఉత్సవాలను సైతం ఏడాది పొడవునా జరిపేందుకు ఆయన అభిమానులు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల మాదిరిగా ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో కార్యక్రమాన్ని జరిపేలా ప్లాన్ చేసినట్లు అభిమాన సంఘాల వాళ్లు వెల్లడించారు. దీంతో ఈ ఏడాది అంతా ఏఎన్నార్ సంవత్సరంగా మారబోతుంది.


Click it and Unblock the Notifications











