నాగచైతన్యతో తమిళ స్టార్ డైరెక్టర్ బై లింగ్యువల్ మూవీ ప్రకటన.. ఎవరున్నారు అంటూ తమిళ ఫ్యాన్స్ ఆవేదన!
విడాకుల ప్రకటన తర్వాత అక్కినేని నాగచైతన్య వరుస సినిమాలు ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆయన నుంచి వచ్చిన అన్ని సినిమాలు దాదాపు హిట్ అవుతున్నాయి. తాజాగా ఆయన తమిళ తెలుగు భాషల్లో ఏక కాలంలో మరో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఆయన ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు? ఆ ప్రాజెక్ట్ ను ఎవరు నిర్మిస్తున్నారు? వంటి వాటికి సంబంధించిన మరిన్ని వివరాలలోకి వెళితే

లవ్ స్టొరీ తరువాత
గత ఏడాది అక్టోబర్ నెలలో అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతున్నట్లు ఓ అధికారిక ప్రకటన చేశారు.. నిజానికి చాలా రోజుల నుంచి వారిద్దరి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని త్వరలోనే వారు విడి పోవచ్చు అంటూ ప్రచారం జరిగింది. అనూహ్య పరిస్థితులలో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమా విడుదలై సూపర్హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత వారిద్దరూ తాము విడిపోతున్నాము అని అధికారికంగా ప్రకటించారు.

థాంక్ యూ అంటూ
అయితే ఆ తర్వాత సమంత మీద పెద్ద ఎత్తున జనాలు మండిపడగా ఆమె దానికి తట్టుకో లేక కొన్ని కేసులు పెట్టడం కూడా అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత నాగార్జునతో కలిసి నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్ యూ అనే సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తోంది.

వెబ్ సిరీస్
ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే నాగచైతన్య దూత అనే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ లో భాగంగా ఈ వెబ్ సిరీస్ ను అమెజాన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాల తర్వాత ఆయన తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఒక సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. తమిళ సూపర్ హిట్ మనాడు సినిమాను తెలుగులో రీమేక్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరగగా అందులో నాగచైతన్య హీరోగా నటించే అవకాశం ఉందని అన్నారు.
కొత్త సినిమా ప్రకటన
అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ అనూహ్య పరిస్థితులలో బుధవారం నాడు వెంకట్ ప్రభు తాను అక్కినేని నాగ చైతన్య mతో కలిసి ఒక సినిమా చేస్తున్నాను అంటూ అధికారికంగా ప్రకటించారు.. సోదరుడు అక్కినేని నాగచైతన్య తో కలిసి ఒక తమిళ తెలుగు ద్విభాషా మూవీ చేస్తున్నానని ఆయన ప్రకటించారు. ఇక ఈ సినిమాను సమంతతో యూ టర్న్, రామ్ హీరోగా ది వారియర్ అలాగే బోయపాటి రామ్ కాంబో సినిమాలు నిర్మిస్తున్న శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు.

మన సినిమాలను లేపేది ఎవరు
ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయాలు మాత్రం ఇంకా బయటికి రాలేదు కానీ త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సినిమా ప్రకటన చేసిన తర్వాత తమిళ అభిమానుల నుంచి ఆసక్తికరమైన కామెంట్లు వినిపిస్తున్నాయి. అందరూ తెలుగు హీరోతో సినిమాలు చేస్తే తమిళ సినిమాను పైకి లేపెది ఎవరు అంటూ వాళ్ళు తమ దర్శకులను ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











