twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' దర్శకుడు నెక్స్ట్ డిటేల్స్

    By Srikanya
    |

    Venkatadri Express director's next for Danayya
    హైదరాబాద్ : రీసెంట్ గా హిట్టైన చిత్రాల్లో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' ఒకటి. చిన్న సినిమా అయినా పెద్ద విజయమే సాధించి పరిశ్రమలో అందరి దృష్టినీ ఆకర్షించింది. దాంతో ఆ చిత్ర దర్శుడు మేర్లపాక గాంధికి వరస ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. అయితే ఎంపిక కరెక్టుగా ఉండాలని ముందుకు వెళ్తున్నాడు గాంధీ. దాజాగా ఆయన ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య తో చిత్రం చేయటానికి కమిటయ్యారు.

    ఇప్పుడు యూత్ అనుభవం లేకపోయినా తెరపై అద్భుతాల్ని సృష్టిస్తోంది. గతేడాది నవతరం దర్శకులు పలువురు మెగాఫోన్‌ చేతపట్టి విజయాలు అందుకొన్నారు. అందులో మేర్లపాక గాంధి ఒకరు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'తో ఇంటిల్లిపాదినీ అలరించారు. ఆ ప్రతిభను పరిశ్రమ కూడా గమనించింది. అందుకే ఇప్పుడు అవకాశాలను కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. గాంధి దర్శకత్వంలో యూనివర్సల్‌ మీడియా ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతోంది. ఇందులో ఓ యంగ్ హీరో నటించబోతున్నారు.

    నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ ''ఇటీవలే కథా చర్చలు పూర్తయ్యాయి. ఇప్పటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా మంచి కథని సిద్ధం చేశారు గాంధి. త్వరలోనే ఆ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాం. వరుస విజయాలను సొంతం చేసుకొంటున్న ఓ యంగ్ హీరో ఇందులో నటించబోతున్నాడు. ఆ వివరాల్ని మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తాము''అన్నారు.

    అలాగే...'వెంకటేశ్, నయనతార కాంబినేషన్‌లో మారుతి దర్శకత్వంలో 'రాధ' చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: డి.పార్వతి.

    English summary
    Merlapaka Gandhi won good name for his debut film, Venkatadri Express. This small budgeted movie starring Sundeep Kishan has turned out to be a good hit. Although the director is flooded with many offers, Merlapaka Gandhi has officially signed only one film. Danayya will produce his next directorial venture. Says Danayya: "We are producing Radha with Venkatesh this year. And then we will start a new film with Merlpaka Gandhi. The film will star a successful hero who gave hits in a row."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X