‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ విజయంతో 14 లక్షల ఇన్సెంటివ్
హైదరాబాద్: సందీప్ కిషన్, రాకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో జెమిని కిరణ్ నిర్మించిన చిత్రం 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద ఊహించని విధంగా మంచి విజయం సాధించింది.
కాగా...ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ జెమిని టీవీ వారు సినిమా విడుదలకు ముందే రూ. 1.7 కోట్లకు కొనుగోలు చేసారు. అయితే సినిమా ఊహించిన దానికంటే భారీ విజయం సాధించిన నేపథ్యంలో జెమినీ టీవీ వారు ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నందుకు గాను రూ. 14 లక్షలు ఇన్సెంటివ్ (ప్రోత్సాహకం) ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్ ద్వారా వచ్చిన మొత్తం రూ. 1.84 కోట్లకు చేరినట్లయింది.
దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్ర కథను ఆసక్తికంగా తయారు చేసుకోవడంతో పాటు కామెడీ అంశాలు మేళవించి వినోదాత్మంగా తెరకెక్కించారు. స్క్రీన్ ప్లే, డైలాగులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కేవలం ఒక రాత్రిలో జరిగిన సంఘటనలను స్టోరీగా మలిచారు. తిరుపతి వెళ్లాల్సిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కాల్సిన హీరో ట్రైన్ మిస్సై ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనేది చిత్ర కథ.
కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే సహించని హీరో వ్యక్తిత్వం కథకు ఎంతో కీలకం. ఏవో కామెడీ సీన్లు కావాలని అతికించినట్లు కాకుండా.....సినిమా కథలో కలిసి పోయే విధంగా తెరకెక్కించిన హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కథ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగిస్తూ...ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. నేరేషన్లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఓవరాల్‌గా సినిమాపై పెద్దగా ఎఫెక్టు చూపలేక పోయాయి. సినిమాలో హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రాకుల్ ప్రీత్ సింగ్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌంట్ అయింది. వీరి మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకు హెలైట్


Click it and Unblock the Notifications












