'బొబ్బిలిరాజా' సీక్వెల్ కి అదే అడ్డం: వెంకటేష్
నా కెరీర్‌లో గుర్తుండిపోయే చక్కటి చిత్రం 'బొబ్బిలిరాజా'. ఆ రోజుల్లో ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలన్న ఆలోచన అయితే ఉంది. అయితే మంచిస్క్రిప్టు రానందువల్లే సీక్వెల్ చేయలేదు. రెండుమూడు స్క్రిప్టులు వచ్చినప్పటికీ, అవి బాగోలేకపోయినందువల్లే అంగీకరించలేదు. మంచిస్క్రిప్టు వస్తే తప్పకుండా చేస్తాను.'బొబ్బిలి రాజా' సీక్వెల్ 'బొబ్బిలి రాజా'కి సీక్వెల్ చేయాలంటే ఇవాళ చాలా నియమ నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. ఆ సినిమాలో చాలా జంతువులు ఉంటాయి. నిజమైన జంతువులతో చేయాలంటే చాలా పర్మిషన్లు తెచ్చుకోవాలి. దానికి చాలా టైమ్ పడుతుంది. వాటిని సడలిస్తే చేయొచ్చు.
అందులో రాణా కూడా చేస్తానంటున్నాడు సరదాగా అన్నారు వెంకటేష్ బొబ్బిలి రాజా సీక్వెల్ గురించి మాట్లాడుతూ. ఇక వెంకటేష్,దివ్య భారతి కాంబినేషన్ కాంబినేషన్ లో రూపొందిన బొబ్బిలిరాజా చిత్రాన్ని బి.గోపాల్ చిత్రం రూపొందించారు. ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. గాడ్స్ మస్ట్ బి క్రేజీ చిత్రాన్ని తీసుకుని ఈ చిత్రాన్ని రెడీ చేసారు. ఈ చిత్రం ఆర్దికంగానే కాక వెంకటేష్ కెరీర్ లో నూ ఓ మంచి హిట్ గా నిలిచిపోయింది. ఆ తర్వాత బి.గోపాల్, వెంకటేష్ కాంబినేషన్ లో రక్త తిలకం,చిన రాయుడు వంటి చిత్రాలు వచ్చినా ఆ రేంజి హిట్ ని అందుకోలేకపోయాయి.


Click it and Unblock the Notifications











