మహేష్ ఒకటికి పదిసార్లు చెకింగ్: వెంకటేష్
హైదరాబాద్ : ''మహేష్‌బాబుతో చాలా నిబద్ధత ఉన్న హీరో . సన్నివేశంలో నటించే ముందు ఒకటికి పదిసార్లు తనను తాను చెక్ చేసుకొంటాడు. ఇక సెట్లో కలుపుగోలుగా, సరదాగా ఉంటాడు. కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది. '' అంటూ మహేష్ ని పొగడ్తల్లో ముంచెత్తారు వెంకటేష్. మహేష్,వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న సీతమ్మ వాకిట్లో సిరి మల్లెచెట్టు గ్యారెంటీగా ఘన విజయం సాధిస్తుందని చెప్తూ ఇలా స్పందించారు.
అలాగే మహేష్ కాంబినేషన్‌లో చేయడం ఓ ఆనందం. తను సెట్‌లో చాలా ఫన్నీగా ఉంటాడు. వర్క్ విషయంలో మాత్రం చాలా సీరియ్‌స్ అతను. నటన విషయంలో చాలా క్లియర్. గుడ్ పెర్‌ఫార్మర్ కూడా....మహేష్ డ్యాన్సులు చాలా బాగా చేస్తాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా ఇద్దర్నీ చూస్తే సొంత అన్నదమ్ముల్లాగే అనిపిస్తుంది. ఈ సినిమా మాయలా అనిపిస్తోంది. ఓ సన్నివేశం పూర్తవగానే... సెట్లో విపరీతమైన స్పందన వచ్చేది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ కథను చాలా చక్కగా తెరకెక్కించాడు అన్నారు.
ఇక ప్రతి కుటుంబానికీ 'సీతమ్మ వాకిట్లో...' సినిమా కనెక్ట్ అవుతుంది. కేరక్టర్లు కూడా అద్భుతంగా ఉంటాయి. కామెడీకి అయితే కొదవే లేదు. ఈ టైమ్‌లో ఇలాంటి చిత్రాలు ఎంతో అవసరం. ఈ సినిమాలో పాతికేళ్ల సీనియర్ హీరో, ఓ సూపర్‌స్టారూ కనిపించరు. సెట్‌లో మేమిద్దరం పక్కపక్కన కూర్చుంటే... సొంత బ్రదర్స్‌లా ఉన్నారని అందరూ అంటున్నారు.
మనిషిలో స్వార్థం పెరిగిపోవడం వల్లే ఈ మార్పు. కొన్నాళ్ల తర్వాత... 'ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అని ఒకటి ఉండేదట' అని చెప్పుకునే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. అసలు ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి?... దాని గొప్పతనం ఏంటి?... అనే విషయాలను హృద్యంగా చర్చించడమే ఈ 'సీతమ్మ వాకిట్లో...'. ఉమ్మడి కుటుంబ విలువలను, అందులోని ఆనందాన్ని, అవసరాన్ని చాలా ఎమోషనల్‌గా చూపించాడు శ్రీకాంత్ అడ్డాల అన్నారు.
సమంత, అంజలి, ప్రకాష్‌రాజ్, జయసుధ, రోహిణిహట్టంగడి, రావు రమేష్, ఆహుతిప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీజెమేయర్, కెమెరా: కె.వి.గుహన్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, నిర్మాత: దిల్‌రాజు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.


Click it and Unblock the Notifications











