నాకు 'స్పాండిలైటిస్' ఉంది కాబట్టి...వెంకటేష్
నాకు 'స్పాండిలైటిస్' ప్రాబ్లమ్ ఉంది. కాబట్టి ఎప్పుడైనా విశ్రాంతి తీసుకోవాలనిపిస్తే హ్యాపీగా ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తాను.షూటింగ్‌లో కానీ వేరే ఎక్కడైనా కానీ నాకు దెబ్బలు తగిలినప్పుడు ఆనందపడతాను. ఆ వంకతో ఇంటిపట్టున ఉండి నా కుటుంబంతో గడిపే వీలుంటుంది అని అంటున్నారు వెంకటేష్. అలాగే పెళ్లయిన తర్వాత నా భార్యకు తగిన సమయం కేటాయించాలని, నా పిల్లల ఎదుగుదలను స్వయంగా చూడాలని అనుకున్నాను. పిల్లల ఎదుగుదల చూడడంటలో ఉన్న ఆనందం ప్రపంచంలో వేరే ఎందులోనూ ఉండదు అంటారు. ఇక నేను నా భార్య మనోభావాలను పూర్తిగా గౌరవిస్తాను. తనంటే నాకు చాలా ఇష్టం. అందుకే తను బాధపడే విధంగా ఏ విషయంలోనూ నడుచుకోను. వివాదాలకు దూరంగా ఉండటానికి సాధ్యమైనంతవరకు కృషి చేస్తుంటాను అంటున్నారు. ప్రస్తుతం వెంకటేష్...పి.వాసు దర్శకత్వంలో చంద్రముఖి సీక్వెల్ లో చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











