మూకీ చిత్రం విషయమై వెంకటేష్
గురువారం హైదరాబాద్‌లో వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా విషయాల్ని వెల్లడించారు. ''ఇరవయ్యేళ్ల తర్వాత మాటల్లేకుండా ఓ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'పుష్పకవిమానం'కి భిన్నంగా ఈ చిత్రం ఉండబోతోంది. నటుడిగా నాకొక ప్రత్యేకమైన అనుభవాన్నిచ్చే చిత్రమవుతుంది. మిగతా విషయాల్ని త్వరలోనే వెల్లడిస్తాను''అన్నారు. మరో ప్రక్క 'బోల్‌బచ్చన్' రీమేక్ గురించి మాట్లాడుతూ "స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. కడుపుబ్బ నవ్వించే సినిమా'' అని అన్నారు.
ఇక షాడో చిత్రం గురించి చెప్తూ... "నేను యాక్షన్ సినిమాలు చేశానని నిన్నటి జనరేషన్‌కి తెలుసు. కానీ నేను నటించిన ఆ సినిమాలు చూడని ఈతరం వారికి 'షాడో' తప్పకుండా నచ్చుతుంది. వెంకటేష్ యాక్షన్ సినిమాలతోనూ మెప్పించగలడని నిరూపిస్తుంది. కుర్రహీరోల సినిమాలు చూసేవారిని కూడా నేను మిస్ కాకూడదనే ఉద్దేశంతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నాను'' అని చెప్పుకొచ్చారు వెంకటేష్. ఆయన నటించిన 'షాడో' శుక్రవారం విడుదల కానుంది.
ఇక "రివెంజ్ ఫార్మేట్‌లో సాగుతుందీ సినిమా. ఫస్ట్‌లుక్ విడుదలైనప్పటి నుంచి చాలా గొప్ప స్పందన వస్తోంది. మోటార్‌బైక్ ఛేజ్‌లు యూత్‌ను అట్రాక్ట్ చేస్తాయి. సేఫ్ యాక్షన్ ఫిల్మ్ ఇది. దర్శకుడు తాను తయారు చేసుకున్న కథను ఐదు నిమిషాలు తొట్రుపాటు లేకుండా చెప్పగలిగితే నా దృష్టిలో ఆ సినిమా హిట్ అయినట్టే. అతను చెప్పిన కథను నేను నా ఫ్రెండ్స్‌కు, ఫ్యామిలీకి చెప్పగలిగితే ఇంకా ఆనందంగా ఉంటుంది. '' అని అన్నారు.


Click it and Unblock the Notifications












