twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరి మా ‘సీతమ్మవాకిట్లో....’ సంగతేంటి?: వెంకటేష్ ప్రశ్న

    By Srikanya
    |

    హైదరాబాద్ : " మనకు ఉన్న టైమ్ రెండు వారాలేగా? మరి మా 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా సంగతేంటి? ఎన్నో కష్టాలు పడి ఆ సినిమా చేసింది వచ్చే కృతయుగంలో చూడ్డానికా? " అంటూ ప్రశ్నించారు వెంకటేష్. ఆయనను ఓ తెలుగు డైలీ వారు యుగాంతం నిజమేనంటారా? అని అడిగితే అలా స్పందించారు.

    అలాగే... " చావు అనేది ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదు. కాకపోతే.. ఒకరు ముందు, ఒకరు వెనుక అంతే. ఒకవేళ నిజంగా యుగాంతం అయితే ఏమవుతుంది? చనిపోతాం... అంతేకదా! అయినా ఇలాంటివి నేను నమ్మను. నిజంగా 21న యుగాంతం అయితే... ఈ ఇంటర్వ్యూలు, సినిమాలు అంటూ మనం టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు?" అన్నారు.

    వెంకటేష్‌, మహేష్‌బాబు హీరోలుగా నటిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం పాటల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ముఖ్య సన్నివేశాల్ని రామోజీ ఫిల్మ్‌సిటీలో తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 16న హైదరాబాద్‌లో ఆడియో విడుదల చేస్తున్నట్లు నిర్మాత దిల్‌ రాజు తెలిపారు.

    దిల్ రాజు మాట్లాడుతూ '' హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్డూడియో గ్రౌండ్స్‌లో అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఆడియోను విడుదల చేయబోతున్నాం. మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త రీతిలోఆడియో వేడుకను నిర్వహిస్తాం. సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో పాటల్ని విడుదల చేయబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని వినూత్న శైలిలో నిర్వహిస్తా ము'' అన్నారు.

    సహ నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్ మాట్లాడుతూ 'పూనేలో మహేశ్, సమంతపై ఈ నెల 6 నుంచి 10 వరకూ ఓ పాట తీశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ నెల 19 నుంచి 21 వరకూ వెంకటేశ్, అంజలిపై కేరళలోని చాలకుడిలో ఓ పాట చిత్రీకరించడంతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. సంక్రాంతి సందర్భంగా జనవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం' అని తెలిపారు.

    ప్రకాష్‌రాజ్, జయసుధ, రోహిణి హట్టంగడి, అభినయ, కోట శ్రీనివాసరావు, వేణుమాధవ్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, మురళీమోహన్, రావు రమేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే.మేయర్, ఫొటోగ్రఫీ: కె.వి.గుహన్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.

    English summary
    Venkatesh says that ..."Yugantham not to be " to a leading telugu news Paper.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X