వివేకానందుడుగా వెంకటేష్ ఖరారు..డిటేల్స్
వెంకటేష్ త్వరలో వివేకానందుడుగా కనిపించనున్నారు. అయితే సినిమాగా కాదు. టీవీ సీరియల్ గా వివేకానందుడు జీవిత చరిత్రను తీయనున్నారు. ఓ ప్రముఖ టీవి ఛానెల్ ఈ టీవీ సీరియల్ ని ప్రసారం చేయనుంది. మిస్సమ్మ, షో వంటి చిత్రాలు రూపొందించిన నీలకంఠ ఈ సీరియల్ ని డైరక్ట్ చేయనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ ప్రాజెక్టు విశేషాలను ఆ మధ్య వెంకటేష్ వివరిస్తూ....తన సోదరుడు సురేష్ బాబు సూచనల మేరకు వివేకానందుడు పాత్ర చేస్తున్నానని వివరించారు. అయితే అది టెలీ-ఫిలిం అని తేల్చారు. అలాగే ఇలాంటి పాత్రలు చేయటం వల్ల తన ఇమేజ్ కేమీ భంగం కలగదని చెప్పుకొచ్చారు. అయితే ఈ టెలి ఫిలింను ఎవరు డైరక్ట్ చేయనున్నారనే సంగతి చెప్పలేదు. ఇక ప్రస్తుతం వెంకటేష్...ఆప్త రక్షక రీమేక్ లో చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చిత్రం చేయటానికి కమిటయ్యారని తెలుస్తోంది.
More from Filmibeat
వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మిస్సమ్మ షో నీలకంఠ టీవీ ఛానెల్ venkatesh vivekananda trivikram missamma show neelakanta


Click it and Unblock the Notifications











