రహస్యంగా వెంకీ పూజ
వెంకటేష్, అమ్మరాజశేఖర్ ల కాంబినేషన్లో రానున్న చిత్రం పూజా కార్యక్రమం నిన్న(ఆదివారం) సురేష్ ప్రొడక్షన్స్ ఆపీసులో సీక్రెట్ గా జరిగింది. అబిమానులకు దూరంగా కొద్ది మంది శ్రేయాభిలాషుల మధ్యన జరిగిన ఈ కార్యాక్రమానికి సురేష్ బాబు సైతం అటెండు కాలేదు. ఆయన ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. అలాగే మీడియాని సైతం ఈ పూజా కార్యక్రమానికి పిలవలేదు. కొద్ది రోజుల్లో మంచి రోజులు లేనందున ఈ పూజా వెంటనే జరిపారని తెలుస్తోంది. ఇక కోనవెంకట్ స్క్రిప్టు అందిస్తున్న ఈ చిత్రం పూర్తి స్దాయి వినోదాత్మకంగా జరుగుతుందని సమాచారం. అమ్మరాజశేఖర్ సైతం ఈ సారి హిట్ ఇవ్వగలనని, రణం నాటి విజయాన్ని రిపీట్ చేయగలనని హామీ ఇచ్చి ఈ చిత్రం చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందే నమో వెంకటేశ చిత్రం కూడా జూన్ 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











