ఇలియానా ఆ హీరోతోనూ
కిక్ తో మరో సారి స్టార్ హీరోయిన్ గా మారిన ఇలియానా తాజాగా అమ్మరాజశేఖర్ చిత్రం కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. వెంకటేష్ తో అమ్మ రాజశేఖర్ చేయనున్న ఈ చిత్రం కోసం రకరకాల పేర్లును పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అందులోనూ గతంలో అమ్మ రాజశేఖర్ తో ఆమె పనిచేసి ఉండటం ఆమెకు కలిసి వచ్చిన అంశం. అందులోనూ వెంకటేష్ తో ఆమె ఇప్పటి వరకూ చేయకపోవటంతో పెయిర్ కూడా ఫ్రెష్ గా ఉంటుందని సురేష్ బాబు, నిర్మాత నల్లమలుపు బుజ్జి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి కోనవెంకట్ స్క్రిప్టు అందిస్తున్నారు.
పూర్త స్ధాయి ఎంటర్టైన్ మెంట్ తో సాగే ఈ కథనం వెంకటేష్ కి టైలర్ మేడ్ సబ్జెక్ట్ అని చెప్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెలవడే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇలియానా..నితిన్ సరసన రెచ్చిపో చిత్రంలో చేస్తోంది. పరుచూరి మురళి డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం కూడా వచ్చే నెల రిలీజయ్యే అవకాశం ఉంది. జూలై నుంచి ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ఆగస్టు నెల మొదటి వారంలో శ్రీను వైట్ల తో చేయనున్న నమో వెంకటేశ ప్రారంభం కానుంది. అందులో శ్రీను లక్కి హీరోయిన్ త్రిష చేస్తోంది.


Click it and Unblock the Notifications











