నాగ్,వెంకీ కాంబినేషన్...

ఇక ఈ చిత్రంలో వెంకటేష్ ,నాగార్జున ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. రణా ఓ కాలేజ్ స్టూడేంట్ పాత్రలో కనపడి ఈ చిత్రం ద్వారా పరిచయమవుతాడు. అలాగే చిరంజీవి,బాలయ్య లని కూడా గెస్ట్ రోల్స్ ద్వారా చూపెట్టాలని యోచిస్తున్నారు. వజ్రోత్సవాలు నాటి పాటలా ఈ సినిమా ఓ భిన్నమైన కథతో సాగుతుందని ఓ సీనియర్ దర్శకుడు,అందరితో పూర్తి స్ధాయి సంభంధాలు కలిగిన వ్యక్తి డైరక్ట్ చేయనున్నారని చెప్తున్నారు. అది రాఘవేంద్రరావు అయ్యుండవచ్చునని సమాచారం.
ఎలానో ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్,రామ్,పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ ఉండనే ఉంటారు. అయితే మహేష్ బాబు మాత్రం కమిట్ కాకపోవచ్చునని విపడుతోంది. ఇలా చేయటం ద్వారా యూనియన్ కీ ఫండ్స, చేకూర్చినట్లవుతుందని, అలాగే ఎన్ని పార్టీలు వచ్చినా అంతా విడిపోకుండా ఉన్నామని బయిట వారికి తెలియ చెప్పినట్లువుతుందని ప్రపోజర్స్ ఆలోజచన. ఇక ఈ ప్రపోజల్ రూమర్ లా మిగిలకూడదని అభిమానులుప కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











