వెంకటేష్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రానున్నసినిమా స్టోరీ అంటూ ఓ పులిహార కథ కూడా ప్రచారంలోకి వచ్చింది. వారు చెప్పేదానే ప్రకారం హీరో వెంకటేష్ ఓ పల్లెలో ఉంటాడు. అనుకోకుండా ముంబయి వెళ్తాడు అక్కడ ఓ సినిమా స్టార్ అయిన ప్రియాంక చోప్రాని చూస్తాడు. ఆమె ప్రేమకోసం ఏం తిప్పలు పడ్డాడు..ఎలా సాధించుకొచ్చాడనేది కథ అంటున్నారు. అంతేగాకుండా ప్రియాంక చోప్రా నలభై ఐదు రోజుల పాటు ఈ చిత్రం కోసం డేట్స్ ఇచ్చిందని మరో రూమర్ కూడా ప్రచారం అవుతోంది. ఇది ప్రక్కన పెట్టి కధ గురించి ఆలోచిస్తే..ఎప్పుడూ నేటివిటిని అద్దుకునే పాత్రలు, కథలు చేసే శ్రీను వైట్ల ఇలాంటి కథతో తీస్తాడా అనేది మాత్రం అనుమానమే. అయితే శ్రీనువైట్ల కాంబినేషన్లో చేయటానికి మాత్రం వెంకటేష్ సమ్మతించాడని సమాచారం. అయితే కథా చర్చలు ఇంకా జరుగుతున్నాయని వార్త. చింతకాయల రవి అనంతరం వెంకటేష్ కథలపై మరింత దృష్టి పెట్టాడని అరుదైన పాత్రతో ముందుకు రావాలని చూస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం కమల్ తో కలిసి ఎ వెడ్నస్ డే రీమేక్ లో చేస్తున్నాడు.