వెంకీ ‘గంగా ది బాడీగార్డ్’ ఫస్ట్ లుక్
వెంకటేష్ హీరోగా 'గంగా ది బాడీగార్డ్" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వెంకీ సరసన త్రిష లీడ్ రోల్ చేస్తుండగా, సలోని ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించి తొలి పోస్టర్ రిలీజైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ శ్రీ సాయి గణేస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. నవంబర్ నెలాఖరు వరకు సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
మళయాళ సూపర్ హిట్ సినిమా 'బాడీగార్డు" సినిమాకు ఇది రీమేక్. ఇప్పటికే సల్మాన్ ఖన్, కరీనా కపూర్ జంటగా నటించిన బాడీగార్డ్ హిందీ రీమేక్ సూపర్ హిట్ గా నిలిచింది. తమిళంలోనూ ఈ సినిమా రీమేక్ అవుతోంది. అయితే ఇప్పటికే సల్మాన్ బాడీ గార్డు హిందీ వెర్షన్ రాష్ట్రంలో భారీ ప్రింట్లతో సందడి చేసిన నేపథ్యంలో వెంకీ బాడీగార్డు రిజల్టు ఎలా ఉంటాయో అనే సందేహం సర్వత్రా నెలకొంది.


Click it and Unblock the Notifications











