వెంకటేష్ మెగా సీరియల్ ఎంట్రీ...
వెండితెరపై తిరుగులేని సక్సెస్ రేషియో వున్న విక్టరీ వెంకటేష్ త్వరలో బుల్లి తెరపై దర్శనమివ్వబోతున్నారు. ప్రస్తుతం 'చంద్రముఖి" సీక్వెల్ 'నాగమల్లి" లో నటిస్తోన్న వెంకీ టీవీ స్ర్కీన్ పై వివేకానదుడిగా కనిపించనున్నారని సమాచారం. సురేష్ బాబు చాలా సీక్రట్ ప్లాన్ చేస్తోన్న ఆ మెగా సీరియల్ వివరాలివి..
వివేకానందుని జీవిత చరిత్రను సినిమాగా తియ్యాలని చాలా మంది అనుకున్నా ఆ ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు స్మాల్ స్ర్కీన్ పై కూడా బిజినెస్ స్కోప్ బాగా పెరిగింది కనుక వివేకానందుని కథని 25 ఎపిసోడ్స్ సీనియల్ గా మలిచే ఆలోచనతో స్రిప్ట్ సిద్ధం చేయిస్తున్నారు సురేష్ బాబు. విక్టరీ వెంకటేష్ వివేకానందుడిగా నటించే ఈ మెగా సీరియల్ ని సినిమాకి ఏమాత్రం తీసిపోని క్వాలిటీతో నిర్మించనున్నారట.
బాషాభేదం లేకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రసారమయ్యేలా, డివిడి రూపంలోనూ అందరికీ అందుబాటులో వుండేలా ఈ టీవీ సీరియల్ ని డిజైన్ చేస్తున్నారు. 'షో", 'మిస్సమ్మ" చిత్రాలతో అభినందనలూ, అవార్డులూ అందుకున్న నీలకంఠ దర్శకత్వంలో ఈ సీరియల్ తెరకెక్కనుంది. మిగిలిన వివరాలు త్వరలో..!


Click it and Unblock the Notifications











