పిక్ టాక్: ‘ఎఫ్ 2’ షూటింగులో జాయినైన వెంకటేష్
వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ 'ఎఫ్2 : ఫన్ & ఫ్రస్టేషన్'. ఈ సినిమా షూటింగ్‌లో కొన్ని రోజుల క్రితమే వరుణ్ తేజ్ జాయిన్ అవ్వగా తాజాగా వెంకటేష్ సెట్స్‌లోకి ఎంటరయ్యాడు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ దర్శకుడు ట్విట్ చేశాడు. 'వెంకటేష్ లాంటి సీనియర్ హీరోతో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను' అని పేర్కొన్నారు.
పూర్తి వినోదాత్మక చిత్రంగా 'ఎఫ్2: ఫన్ & ఫ్రస్టేషన్' మూవీ తెరకెక్కుతోంది. వెంకటేష్ గతంలో ఎన్నడూ చేయని ఒక డిఫరెంట్ పాత్రలో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నారు. అనిల్ రావిపూడి స్టైల్లో పూర్తి ఫన్ రైడ్‌లా ఈ సినిమా సాగబోతోంది.
అనిల్ రావిపూడి గత చిత్రాలు పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ మంచి విజయాలు సాధించడం, హిట్ చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు తన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నేపథ్యంలో.... 'ఎఫ్2: ఫన్&ఫ్రస్టేషన్' సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కమర్షియల్ వేల్యూస్‌తో కామెడీ ఎంటర్ టైనర్స్‌ను తెరకెక్కించే దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను ఆద్యంతం ఫన్ రైడర్‌గా తెరకెక్కిస్తారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తున్నాం అని యూనిట్ సభ్యులు తెలిపారు.


Click it and Unblock the Notifications











