బర్త్ డే స్పెషల్ : వెంకటేష్‌తో మెహర్ రమేష్
హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోగా ఎదిగిన వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. 1986లో కలియుగ పాండవులు చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన వెంకీ...గత 26 సంవత్సరాలుగా టాలీవుడ్లో తన హవా కొనసాగిస్తున్నారు. డిసెంబర్ 13, 1960లో జన్మించిన ఆయన నేటితో 52 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.
ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే,మొదలైనవి. మ ఆయన ఇప్పటి వరకు దాదాపు 60కిపైగా సినిమాలలో నటించిన ఈయన 7 నంది అవార్డులు గెలుచుకున్నాడు.
ప్రస్తుతం వెంకటేష్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో పాటు...మెహర్ రమేష్ దర్శకత్వంలో 'షాడో' చిత్రం చేస్తున్నారు. వెంకీ పుట్టిన రోజును పురస్కరించుకుని 'షాడో' చిత్రానికి సంబంధించిన స్పెషల్ పోస్ట్ ను విడుదల చేసారు. ఇందులో ఒక దానిలో వెంకీతో కలిసి దర్శకుడు మొహర్ రమేష్ ఫోటోలకు ఫోజులివ్వడం గమనార్హం.
వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రధారులుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈచిత్రంలో మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ, శ్రీకాంత్ సరసన మధురిమ నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











