వెంకీ కొడుకు హీరో అవుతాడా?
తులసీ విక్టరీతో ఖుషీగా ఉన్న వెంకటేష్ గురువారంనాడు (డిసెంబర్ 13) తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాడు. ఈ జన్మదినోత్సవాన్ని వెంకీ కుటుంబంతో జరుపుకుంటున్నాడు. కుమారుడు అర్జున్ గురించి వెంకటేష్ ఈ జన్మదినం సందర్భంగా ఏమైనా చెబుతారా అని అడిగితే అలాంటిదేమీ లేదండీ వాడు చిన్నవాడు అన్నాడు. తులసిలో నటించింది అర్జునే అని తొలుత చాలామంది భావించారు కానీ వాడు కాదని, వాడు సినిమా తెరపై కనిపించడానికి ఇంకా చాలా టైమ్ ఉందని వెంకీ అంటున్నాడు. వాడు జీవితంలో ఏం కావాలనుకుంటే అది కావచ్చని వెంకీ తన వేధాంత దోరణిలో వెలిబుచ్చాడు. కాగా భవిష్యత్ లో యోగి, మంజుల, శేఖర్ కమ్ములలతో సినిమాలు చేయనున్నట్టు వెంకటేష్ చెప్పాడు


Click it and Unblock the Notifications











