వెంకటేష్ 'బొబ్బిలి రాజా' రీమేక్ కు సన్నాహాల
వెంకటేష్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన బొబ్బలిరాజా చిత్రం త్వరలో రీమేక్ వెర్షన్ గా మరోసారి ప్రేక్షకలను అలరించే అవకాశం ఉంది. ఈ రీమేక్ నిమిత్తం గత కొద్ది రోజులుగా నిర్మాత డి.సురేష్ బాబు తన టీమ్ తో చర్చలు జరుపుతన్నట్లు సమాచారం. రాణా తదుపరి చిత్రంగా దీన్నీ రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే మారిన కాలానికి తగినట్లు మార్పులు చేర్పులు ఎలా చేయాలి అన్నదానిపై ఓ అవగాహకు వచ్చి స్క్రిప్టు ప్రారంభించాక పూర్తి నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశం ఉంది. ఇక బొబ్బిలిరాజా హిట్ లో అప్పటి స్టార్ హీరోయిన్ దివ్య భారతికీ సమాన షేర్ ఉంది. ఆమె పాత్రకు ఎవరిని తీసుకోవాలి..ఎవరు సరిపోతారు...అలాగే ఆ హీరోయిన్..రాణా హైట్ కి సరపడ ఉండాలి, దర్శకుడుగా ఎవరని ఫైనల్ చేయాలి అనే విషయాలపై ఆలోచన చేస్తున్నారు. ఇక రామానాయుడు కూడా ఈ రీమేక్ పై చాలా ఆసక్తిగా ఉన్నారు. ఆయన ఓసారి మీడియా వద్ద ఈ విషయం ప్రస్దావించారు కూడా. రాముడు-భీముడు రీమేక్, నాగేశ్వరరావుతో చేసిన ప్రేమనగర్ చిత్రాలే కాగ బొబ్బిలిరాజా కూడా ఆ రీమేక్ లిష్టులో ఉందని చెప్పారు.


Click it and Unblock the Notifications











