'లక్ష్మీ', 'ఆడవారి మాటలకు ఆర్ధాలే వేరులే', 'తులసి'..సినిమాల విజయంతో హ్యాట్రిక్ హీరోగా మారారు వెంకటేష్. ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమా " చింతకాయల రవి . . .'సాఫ్ట్ వేర్ ఇంజినీర్'. ఇందులో వెంకటేష్ అమెరికా లో ఉంటాడుట. అక్కడే మొదటి హీరోయిన్ పరిచయం అవుతుందిట. వాళ్ళిద్దరూ ఎప్పుడూ గొడవలు పడుతూంటారట. తరువాత వెంకటేష్ పెళ్ళికోసం ఇండియా తిరిగి వచ్చినప్పుడు కథ అసలు మలుపు తిరుగుతుందట. కామిడీతో సాగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా దీన్ని తీర్చిదిద్దుతున్నారట. ఇందులో వెంకటేష్ 'నువ్వు నాకు నచ్చావ్' తరహా మిడిల్ క్లాస్ మెంటాలిటి ప్రదర్శించే పాత్రను పోషిస్తున్నారట. ఆయన సరసన తొలిసారిగా హీరోయిన్లు అనుష్క, మమతా మోహన్‌దాస్ నటిస్తున్నారు. ఈ సినిమాకు 'ఒక రాజు ఒక రాణి' ఫేమ్ యోగి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వెంకటేష్ తో 'లక్ష్మి' సినిమాను నిర్మించి హిట్ కొట్టిన నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఢీ రైటర్ కోన వెంకట్ చిత్రానికి కథ అందిస్తున్నాడు.కథ డిమాండ్ మేరకు షూటింగ్ హైదరాబాద్, విశాఖపట్నం, అమెరికాలలో జరుగుతోంది