twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సీతమ్మ వాకిట్లో...’ డౌట్స్ పై వెంకటేష్ క్లారిఫికేషన్

    By Srikanya
    |

    హైదరాబాద్: మహేష్‌ బాబుతో కలిసి వెంకటేష్ నటించిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. సమంత హీరోయిన్ గా నటింటిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగావిడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. అందులో వెంకటేష్ కూడా పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా..వెంకటేష్ ని... మీడియా వారు.. చిత్రంలో ఆయన పెద్దోడు పాత్రపై సందేహాలు వెల్లబుచ్చారు. చిత్రంలో పెద్దోడు పాత్ర కు ఉద్యోగం లేకుండా ఉంటుంది. మొదట్లో ఓ ఉద్యోగం చేసినా తన ముక్కుసూటి తనంతో దాన్ని పోగొట్టుకుంటాడు.

    ఈ విషయమై మీడియా వ్యక్తి...చిత్రంలో మీరు ఉద్యోగం లేకపోయినా మీ తమ్ముడు హైదరాబాద్ వెళ్తూంటే..ఎలా డబ్బు మీ తమ్ముడు మహేష్ పాత్రకు ఇస్తారు అని అడగటం జరిగింది. దానికి వెంకటేష్ నవ్వుతూ... అది సినిమాటెక్ గా చూపిన సీన్స్ అని చెప్పారు. అలాగే... అతనికి జాబ్ లేదని చూపం కానీ.. డబ్బు లేదని కాదు గా అని క్లారిఫై ఇచ్చారు. అయినా చేతిలో డబ్బు లేకపోతే దూర ప్రాతం కు వెళ్తున్న వారికి అప్పు చేసైనా ఇస్తూండటం మధ్యతరగతి కుటుంబాలలో అతి సహజం.

    ఇక ఈ చిత్రంలో అంజలి, ప్రకాష్‌ రాజ్‌, జయసుధ ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మాత. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ లో మాత్రం ఓ రేంజిలో దుమ్ము రేపుతోందని ట్రేడ్ టాక్. ఉన్న థియోటర్స్ విపరీతమైన రద్దీతో ఉండటంతో చాలా టౌన్స్ లో థియోటర్స్ ని పెంచి ప్రదర్శిస్తున్నారు. అలాగే చాలా చోట్ల ఈ సంక్రాంతి మూడు రోజు రోజులు ఉదయం ఆరు గంటల నుంచి షో లు ప్రారంభించి, షోలు పెంచి ప్రదర్శిస్తున్నారు. మహేష్ కొత్త సినిమా కావటం, ఫ్యామిలీలు టార్గెట్ కావటం ఈ సినిమాకు కలిసి వచ్చింది. అయితే సంక్రాంతి వెళ్లిన తర్వాత కూడా కలెక్షన్స్ ఇలాగే స్టాండ్ గా నిలబడి ఉంటాయా లేదా అన్న విషయంపై విజయం రేంజి ఆధారపడి ఉంటుంది.

    English summary
    Venkatesh stated that some cinematic logics should not be checked with too much intelligence. 'One someone is not having job, that doesn't mean that he is also not having money', clarified Venky for his character in SVSC.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X