పవర్ పంచ్... మహేష్ బాబుదా? వెంకీదా?
సంక్రాంతి కానుకగా ఈ సారి పెద్ద హీరోల సినిమాలు విడులవుతున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ 'బాడీగార్డు', మహేష్ బాబు 'బిజినెస్ మేన్', రవితేజ 'నిప్పు' తో పాటు సునీల్ పూల రంగడు సినిమాలు విడుదలవుతున్నాయి. అన్ని సినిమాల్లో కెళ్లా ఎక్కువ సినిమాల అంచనాలు 'బిజినెస్ మేన్', బాడీగార్డు సినిమాలపైనే ఉంది.
బాడీగార్డు మలయాళ, హిందీ వెర్షన్ లు ఇప్పటికే సంచలన విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో వెంకీ నటిస్తున్న తెలుగు వర్షన్ బాడీగార్డ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కామెడీ పంచ్ డైలాగులు పేల్చడంలో మంచి పేరు తెచ్చుకున్న మాటల రచయిత కోన వెంకట్ ఈ సినిమాకు పని చేస్తుండటం, కామెడీ పంచ్‌లు పేల్చడంలో వెంకీ కూడా మంచి అనుభవం ఉండటం ఈసినిమాపై అంచనాలు భారీగా పెరగడానికి ఓ కారణం.
మరో వైపు...బ్లాక్ బస్టర్ 'పోరికి' కాంబినేషన్ రిపీట్ అవుతుండటం, పూరి జగన్నాథ్ ఈ సారి పోకిరిని మించిన రేంజ్ మహేష్ బాబుతో యాక్షన్ పంచ్ డైలాగ్స్ చెప్పిస్తుండటం కూడా బిజినెస్ మేన్ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగి పోయాయి.
మరి ..ఈ సంక్రాంతికి వెంకటేష్ కామెడీ పంచ్ వర్కౌట్ అవుతుందా? లేక మహేష్ బాబు యాక్షన్ పంచ్ దుమ్ము రేపుతుందా? అనేది మరికొన్ని రోజుల్లో తేల నుంది.


Click it and Unblock the Notifications











