పవన్ కల్యాణ్‌కు తిక్క.. అది కరెక్టే.. వెంకటేష్ కామెంట్స్.. ‘స్వచ్ఛ’ అఙ్ఞాతవాసి (వీడియో)
Recommended Video

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే ఎప్పుడూ, ఏ సినిమాకు రానటువంటి నెగిటివ్ టాక్ అఙ్ఞాతవాసికి వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంపై కూడా దారుణమైన కామెంట్లు వచ్చాయి. సినిమా కథ, కథనం విషయంలో తగిన శ్రద్ద చూపించలేదని అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు చేపట్టారు. అవేమింటంటే

అఙ్ఞాతవాసిలో స్వచ్ఛభారత్
అఙ్ఞాతవాసిలో చెత్త సీన్లను తొలగించే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఇటీవల ముగించారు. కొన్ని సీన్లను తొలగించి ఇటీవల వెంకటేష్ ఉన్న సన్నివేశాలను జోడించారు. ఈ నేపథ్యంలో ఓ వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు.

వెంకటేష్‌తో డబ్బింగ్
అఙ్ఞాతవాసి చిత్రంలో కొత్త సన్నివేశాలను చేర్చడానికి ముందు వెంకటేష్‌తో డబ్బింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. డబ్బింగ్ థియేటర్‌కు వెంకటేష్ వచ్చే దగ్గరి నుంచి డబ్బింగ్ చెప్పే సన్నివేశాలను వీడియోగా చిత్రీకరించారు.

గురు గారూ.. గురూ గారూ.. అంటూ
డబ్బింగ్ సందర్భంగా పవన్ కల్యాణ్ ‘గురు గారూ.. గురు గారూ' అని అనగా.. గారూ అవసరం లేదు అని వెంకటేష్ జవాబిస్తారు. అందుకు ఏదో విషయంపై పవన్ కల్యాణ్ పగలబడి నవ్వుతాడు. పవన్‌కు జతగా త్రివిక్రమ్, నిర్మాత ఎస్ రాధాకృష్ణ కూడా కలిశారు.
పవన్ తిక్కకు లెక్క.. వెంకటేష్
ఆ తర్వాత పవన్ కల్యాణ్.. నాకు కొంచెం తిక్క ఉంది అనగానే.. వెంకటేష్ దానికి తిక్క ఉంది అంటూ కామెంట్ ఇచ్చుకొన్నారు. వెంటనే అదీ డైలాగ్ అంటూ వెంకీ నవ్వుల్లో మునిగిపోయారు.

ఫ్యామిలీ ఆడియెన్స్ టాక్
అఙ్ఞాతవాసి చిత్రంలో వెంకటేష్ సన్నివేశాలను చేర్చడం, కొన్ని సీన్లను తొలగించిన తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి సినిమా బాగుందనే టాక్ వినిపిస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారంలో కలెక్షన్లు ఎలా ఉంటాయో వేచిచూడాల్సిందే.


Click it and Unblock the Notifications











