అది చేదు అనుభవం..వెంకటేష్
కలియుగపాండవులు తర్వాత 4, 5 సినిమాలు పరాజయం పాలయ్యాయి. షూటింగ్‌లో ఉండగానే ఓసారి యాక్సిడెంట్ జరిగింది. గాయాల పాలాయ్యను. ఆ సమయంలో కొన్ని చిత్రాలు వదుకోవాల్సి వచ్చింది. 'రోజా' చిత్రంలో నటించాల్సింది. గాయాలు తగలడంతో మానుకోవాల్సివచ్చింది అదే తన జీవితంలో చేదు అనుభవం గా పేర్కొన్నారు స్టార్ హీరో వెంకటేష్.ఆయన ఇటీవల 25 ఏళ్ళ సినీ కెర్‌ను పూర్తిచేసుకున్న సందర్భంగా మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ఎంతోమంది సీనియర్స్ దర్శకులతో పనిచేసిన తీపి అనుభవముంది. కె.రాఘవేంద్రావు, కోడిరామకృష్ణ, విజయభాస్కర్, విశ్వనాథ్ ఇలా ఎంతోమందినుంచి వ్యక్తిగతంగా సినిమాపరంగా చాలా నేర్చుకున్నా.
ఎంతోమంది హీరోయిన్లను, టెక్నీషియన్స్‌ను పరిచయం చేస్తేవారంతా ఇప్పుడు ఎంతో ఎత్తు ఎదిగారని అదంతా తీపి అనుభవమే. ఆ తర్వాత చాలా మంచి చిత్రాలు చేశాను.ప్రస్తుతం బాడీగార్డ్ చిత్రం చేస్తున్నా. హిందీలో సల్మాన్‌ఖాన్ చేస్తున్నాడు. ఆ చిత్రానికి ఈచిత్రానికి కొంత వ్యత్యాసం ఉంటుంది. దాదాపు 70శాతం పూర్తయింది. ఆ తర్వాత దశరథ్ దర్శకత్వంలో, సురేష్‌ప్రొడక్షన్స్‌లో, దిల్‌రాజు చిత్రంలో నటిస్తున్నా.. ఇందులో మహేష్‌బాబు. కూడా నటిస్తున్నాడు. 'వివేకానంద' చిత్రం చేయాలనుంది. దానికోసంస్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది అన్నారు.


Click it and Unblock the Notifications











