త్రివిక్రమ్ ని బ్యాడ్ చేసిన ‘మహేష్ ఖలేజా’-కండీషన్ తో వెంకటేష్..!?
రైటర్ డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాలు తియ్యాలంటే నిర్మాతలు భయపడిపోతున్నారు. ఒక్కో సినిమాను రెండు సంవత్సరాల పాటు తీస్తాడనే బ్రాండ్ అతని పై పడింది. మహేష్ 'ఖలేజా" రెండేళ్ళుగా తీస్తూనే వున్నాడు. తన పై పడిన ఈ అపవాదును పోగొట్టుకునేందుకు త్రివిక్రమ్ తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలిసింది.
అదెలాగంటే యమస్పీడ్ గా ఒక కథను రెడీ చేసుకొని వెంకటేష్ కి వినిపించాడట. ఆ కథ నచ్చి వెంకీ ఓకే చేసారట. త్రివిక్రమ్ సంగతి తెలిసిన వెంకటేష్ ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఆర్నెల్లలో కంప్లీట్ చెయ్యాలని కండీషన్ పెట్టాడట. సినిమా తియ్యడానికి ఎక్కువ సమయం తీసుకోవడానికి అలవాటు పడ్డ త్రివిక్రమ్ ఈ సినిమాను మాత్రం ఆర్నెల్లలోనే తీసేసి తన కెరీర్ ను కాపాడుకుందామనే ఆలోచనలో పడ్డాడు. కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆల్రెడి వెంకీ నటించిన నువ్వు నాకు నచ్చావు, మరియ మల్లీశ్వరీ చిత్రాలకు డైలాగు అందించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











