అసిస్టెంట్ డెరైక్టర్ గా కూడా చేసా: వెంకటేష్

అలాగే...బాడీగార్డ్ గురించి చెపుతూ.. అదృష్టం కొద్దీ ఈ సినిమాకు అన్నీ కలిసొచ్చాయి. ఇదొక డిఫరెంట్ కైండాఫ్ లవ్‌స్టోరీ. ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్... ఇలా అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. నాతో పాటు సినిమా చూసిన వాళ్లందరూ చాలా పాజిటివ్‌గా స్పందించారు. ఇందులోని టైట్ స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్, కథలోని ఎనర్జీ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సెన్సార్ వారు 'యు' సర్టిఫికెట్ ఇచ్చారు. తప్పకుండా ఈ సంక్రాంతికి 'బాడీగార్డ్' ఓ విజువల్ ట్రీట్‌గా నిలుస్తుంది అన్నారు.
కథ గురించి చెపుతూ..'బాడీగార్డ్'కి బాధ్యతలు మాత్రమే కాదు. బంధాలు కూడా ఉంటాయి. కంటికి కరకుగా కనిపించే 'బాడీగార్డ్'కి మనసు కూడా ఉంటుందని తెలిపే కథ ఇది. సంక్రాంతి కానుకగా వస్తున్న మా 'బాడీగార్డ్' కమ్మని విందుభోజనం లాంటిది అని కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











