మహేష్‌కు వెంకీ విషెస్..(SVSC పోస్టర్ ఫస్ట్ లుక్)
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్-ప్రిన్స్ మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెట్టు'. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. వెంకీ-మహేష్ అన్నదమ్ముళ్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్‌గా ఫోకస్ కానుంది.
మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సెకండ్ ట్రైలర్‌ను మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న విడుదల చేయాలని సన్నాహాలు చేయనున్నారు. కాగా మహేష్ బాబుకు వెంకటేష్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయంది.
కూతురు సితార పుట్టిన ఆనందంలో ఉన్న మహేష్.. పాపతో గడిపేందుకు షూటింగ్ కు కొద్ది రోజులు బ్రేక్ తీసుకున్నాడు. తన బర్త్ డే తర్వాత తిరిగి షూటింగ్ లో పాల్గొంటాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











