twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గేట్లు ఎత్తేస్తున్నారు ఇకపై మనదే బాధ్యత.. వెంకీమామ ట్వీట్ వైరల్

    |

    ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. కరోనా ధాటికి ప్రపంచ దేశాలన్నీ విలవిల్లాడుతున్నాయి. లక్షల సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. మరణాలు కూడా అదే స్థాయిలో సంభవిస్తున్నాయి. మన దేశంలోనూ కరోనా అంతకంతకూ తన ప్రాభవాన్ని పెంచుకుంటూ పోతోంది. నానాటికి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. మన దేశంలోనూ పరిస్థితి చేజారిపోయేలా కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా విధించిన లాక్‌డౌన్‌పై సోషల్ మీడియాలో ఎన్నో సెటైర్స్ వినిపిస్తున్నాయి.

    చేతులెత్తేసిన ప్రభుత్వం..

    చేతులెత్తేసిన ప్రభుత్వం..

    కరోనా కేసులు వందల్లో ఉన్నప్పుడు కఠినంగా ఉన్న లాక్ డౌన్.. పరిస్థితి విషమించి పోతూ ఉండటంతో సులభతరంగా మారుతూ వచ్చింది. చివరకు రెండు లక్షలకు దగ్గరల్లో ఉన్న సమయంలో విధించిన లాక్ డౌన్‌లో ఎన్నో సడలింపులు ఇచ్చారు. థియేటర్స్, మాల్స్, జిమ్స్, పబ్స్ వంటివాటికి తప్ప మిగిలిన అన్నింటికి అనుమతిని ఇచ్చేశారు.

    స్పందించిన వెంకటేష్..

    స్పందించిన వెంకటేష్..

    కరోనా కట్టడి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పోరాటం చేస్తున్న వైద్యులు, పోలీసులపై వెంకటేష్ సందర్భానుసారంగా ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నాడు. జనతా కర్ఫ్యూ నాడు, దీపాలు వెలిగించమని చెప్పినప్పుడు ఇలా ప్రతీ సందర్భంలో వెంకీ తన కర్త్యవాన్ని పాటించాడు. తాజాగా ఐదో దశ లాక్ డౌన్‌ను ఉద్దేశించి స్పందించాడు.

    కృతజ్ఞతలు చెబితే సరిపోదు

    కృతజ్ఞతలు చెబితే సరిపోదు

    వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..‘కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి గత 70 రోజులుగా నిర్విరామంగా కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు. ప్రజలందరి రక్షణ కోసం రాత్రింబవళ్లూ కష్టపడి పనిచేసిన సిబ్బందికి కేవలం కృతజ్ఞతలు చెబితే సరిపోదు.

    మనదే బాధ్యత..

    మనదే బాధ్యత..

    ఇప్పుడిప్పుడే గేట్లు తెరుచుకుంటున్నాయి. ఇప్పుడిక మనదే బాధ్యత. ప్రస్తుతం లాక్‌డౌన్ మాత్రమే ముగిసింది.. వైరస్ ప్రస్థానం కాదు. కాబట్టి లాక్‌డౌన్ కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో.. వాటిని ఇకపై కూడా పాటించాలి. సురక్షితంగా ఉండండి.. భౌతిక దూరం పాటించండ'ని అందర్నీ కోరాడు. వెంకటేష్ ప్రస్తుతం అసురన్ రీమేక్ నారప్ప సినిమాను చేస్తున్నాడు.

    English summary
    Venkatesh Daggubati About 5th Stage Lockdown. He says That Stay Safe and continue to practice social distancing!!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X