వెంకటేష్ విచిత్ర కోరిక!?!?!
హీరోలు ఆడవేషం వేయడం కొత్తేంకాదు. స్వర్గీయ ఎన్టీఆర్ మొదలు అక్కినేని నాగేశ్వర్ రావు...చిరంజీవి, రాజేంద్రప్రసాద్...తాజాగా తమిళ విక్రమ్ కూడా ఆడవేషం వేసినవారే. వీరంతా పాత్రోచితంగా వేశారు. ఇదేం చిత్రమో గానీ విక్టరీ వెంకటేష్ మాత్రం తన తదుపరి చిత్రంలో విచిత్రంగా ఆడవేషం వేయాలని ముందే కోరుకుంటున్నాడట. 50 రోజులవైపు దూసుకెళుతున్న తులసి సినిమా తరువాత విశ్రాంతి తీసుకుంటున్న వెంకటేష్ కు ఆడవేషం వేయాలని ఎందుకనిపించిందో ఏమో కానీ వెరైటీగా కనిపించబోతున్నారన్నమాట. మరి ఆయన ఆడవేషం వేస్తే చూడగలమో లేదో...ఇపుడే ఊహించుకోకండి.


Click it and Unblock the Notifications











