twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘తలాష్’ రీమేక్‌పై కన్నేసిన వెంకీ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : ఈ సంవత్సరం మొదట్లో 'బాడీగార్డ్' రీమేక్ ద్వారా హిట్టు కొట్టిన విక్టరీ వెంకటేష్, తాజాగా మరో రీమేక్ సినిమాపై కన్నేసాడు. అమీర్ ఖాన్ హీరోగా బాలీవుడ్లో ఇటీవల విడుదలైన 'తలాష్' మంచి విజయం సాధించిన నేపథ్యంలో....దాని రీమేక్లో నటించాలనే యోచనలో వెంకీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ చిత్రాన్ని వెంకీ చూసారని, తన బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా సినిమా ఉండటంతో ఈ మేరకు ప్రయత్నాలు మొదలు పెట్టాడని సమాచారం.

    తెలుగు నేటివిటీకి తగిన విధంగా కథలో మార్పులు చేసి మరింత తెలుగు మసాలా జోడిస్తే సినిమా హిట్టే. పోలీస్ ఆఫీసర్ పాత్రలు తనకు బాగా సూటవుతాయని ఇప్పటికే ఘర్షణ లాంటి సినిమాలు నిరూపించాయి. ఈ నేపథ్యంలో వెంకీ 'తలాష్' రీమేక్ పై ఆశ పడుతున్నట్లు టాక్. మరి వెంకీ ఆలోచన ఆచరణలోకి వస్తుందో లేదో చూడాలి.

    సినిమా కథ విషయానికొస్తే.... రోషిణి(రాణి ముఖర్జీ)తో షెఖావత్‌(అమీర్ ఖాన్)కి వివాహం అయ్యాక కొంతకాలానికి ఆ బంధం తెగిపోతుంది. రోషిణి సమాజ సేవిక అవుతుంది. పోలీస్‌ ఆఫీసర్‌గా కొన్ని కేసుల పరిశోధనలో వేశ్య రోసీ(కరీనా కపూర్)తో షెఖావత్‌కి పరిచయం ఏర్పడుతుంది. ఆ తరువాత ప్రారంభమైన వెదుకులాటతో ముగ్గురి జీవితాల్లోను జరిగే సంఘటనలు ఆసక్తి కరంగా ఉంటాయి.

    అమీర్ ఖాన్, రాణి ముఖర్జీ, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో 'తలాష్' రూపొందించారు. ఈ చిత్రం నవంబర్ 30న విడుదలయింది. రీమా కాగ్టి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని రితేష్ సిద్వాని, అమీర్ ఖాన్, ఫరాన్ అక్తర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, కథ: రీమా కాగ్టి, జోయా అక్తర్, సంగీతం: రామ్ సంపత్, సినిమాటోగ్రఫీ: మోహన్, ఎడిటింగ్: ఆనంద్ సుబ్బయ్య.

    English summary
    Victory Venkatesh is all set do Aamir Khan ‘Talaash’. Yes, the Telugu superstar has made up his mind to remake Aamir’s ‘Talaash’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X