»   » టీనేజీ అమ్మాయితో వెంకటేష్ ప్రేమాయణం?

టీనేజీ అమ్మాయితో వెంకటేష్ ప్రేమాయణం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వెంకటేష్ ఈ మధ్య కాలంలో తన వయసుకు తగిన సినిమాలు చేస్తూ వెళ్లి పోతున్నారు. ప్రేమ కథల జోలికి అసలు వెళ్లడం లేదు. అయితే త్వరలో ఆయన ఓ టీనేజీ అమ్మాయితో ప్రేమలో పడే కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఇందుకు సంబంధించిన కథను వెంకీకి వనిపించినట్లు సమాచారం.

పెళ్లయిన మిడిలేజ్ వ్యక్తికి టీనేజర్‌తో ప్రేమలో పడే కథాంశంతో ఈ సినిమా సాగుతుందని సమాచారం. అయితే కథలో అతనికి భార్య ఉంటుందా? లేదా? అనే విషయం సినిమా పట్టాలెక్కితే గానీ తెలియదు. ఈ స్టోరీ వెంకీకి చాలా నచ్చిందని, వెంటనే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Venkatesh Falls In Love

ఇలాంటి కథలు ఈ మధ్య కాలంలో తెలుగులో కొన్ని వచ్చాయి. అయితే వెంకీ చేయబోతున్న ఈ కథ డిఫరెంటుగా ఉంటుందని, అతని పెళ్లవుతుంది కానీ...భార్య ఉండదని సమాచారం. పరిస్థితులు అతన్ని టీనేజీ అమ్మాయితో ప్రేమలో పడే విధంగా చేస్తుందని సమాచారం.

ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లా కాకుండా.... మనసుకు హత్తుకునే సన్నివేశాలతో ఉంటుందని టాక్. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇలాంటి కథలు తెలుగులో వర్కౌట్ అవుతాయో? అంటూ సందేహ పడేవారూ ఉన్నారు.

English summary
Buzz has that Venkatesh has loved a story narrated by director Chandrasekhar Yeleti, which revolves around a married middle-aged person falling in love with a teenager.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu